ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Suryapet: సెల్ఫీ దిగడానికి నేనేమైనా హీరోయిన్‌నా?

ABN, Publish Date - Feb 03 , 2025 | 04:08 AM

కొన్ని నెలలుగా వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న అఘోరీ ఈసారి సూర్యాపేట జిల్లాలో వీరంగం సృష్టించింది.

  • సెల్ఫీ అడిగిన యువకులపై అఘోరీ దాడి

  • సూర్యాపేట జిల్లాలో ఘటన

సూర్యాపేట, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కొన్ని నెలలుగా వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న అఘోరీ ఈసారి సూర్యాపేట జిల్లాలో వీరంగం సృష్టించింది. సెల్ఫీలు అడిగిన యువకులపై ‘సెల్ఫీ దిగడానికి నేనేమైనా హీరోయిన్‌నా’ అంటూ దాడికి తెగబడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం కారులో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న అఘోరీ రాత్రి 9.30 గంటల సమయంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉండ్రుగొండ వద్ద ఉన్న గంగ గుడి, పెద్దమ్మ గుడి స్టేజీ వద్ద ఆగింది. అప్పుడు ఇద్దరు యువకులు అడగడంతో వారితో సెల్ఫీ దిగింది. ఆ తర్వాత మరికొందరు యువకులు కూడా అఘోరీని సెల్ఫీ అడిగారు.


దాంతో వారితో దురుసుగా ప్రవర్తించి అర్ధరాత్రి 1.39 గంటల వరకు వీరంగం సృష్టించింది. కారులో నుంచి తల్వార్‌ను తీసుకొచ్చి ఓ యువకుడిపై దాడికి పాల్పడింది. దాంతో అతడికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆదివారం ఉదయం రహదారి పక్కన అమరావతి హోటల్‌ దగ్గర టిఫిన్‌ కోసం ఆగిన అఘోరీని మరికొందరు యువకులు సెల్ఫీ అడిగారు. ‘సెల్ఫీ దిగడానికి నేనేమైనా హీరోయిన్‌నా’?అంటూ వారిపై దాడి చేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని అఘోరీని అక్కడి నుంచి పంపించారు.


ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 04:08 AM