Phone Tapping Case : చంచల్‌గూడ జైలు నుంచి తిరుపతన్న విడుదల
ABN, Publish Date - Jan 29 , 2025 | 04:07 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన అదనపు ఎస్పీ తిరుపతన్న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. తిరుపతన్నకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్/ సైదాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన అదనపు ఎస్పీ తిరుపతన్న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. తిరుపతన్నకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిలు కాపీలు జైలు అధికారులకు అందడంతో మంగళవారం సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ట్యాపింగ్ కేసులో అరెస్టయిన తిరుపతన్న గత 10 నెలలుగా చంచల్‌గూడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల ఫోన్లను తిరుపతన్నతోపాటు ఈ కేసులో అరెస్టయిన సహ నిందితులు నిబంధనలకు విరుద్ధంగా ట్యాపింగ్ చేశారని దర్యాప్తు అధికారులు అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. కాగా, ఇదే కేసులో ఏ3గా ఉన్న భుజంగరావు అనారోగ్య కారణాలతో గత ఆగస్టు నుంచి మధ్యంతర బెయిలుపై జైలు బయటే ఉన్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం..
Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..
Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..
Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం
Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!
Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి
Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు
Also Read: జగన్ నాడు నేడు.. అసలు రహస్యం చెప్పిన కేంద్రం
Also Read: బీజేపీ విజయం కోసం హస్తినకు చంద్రబాబు.. ఆ నియోజకవర్గాల్లో చక్రం తిప్పనున్న సీఎం
For Telangana News And Telugu News
Updated Date - Jan 29 , 2025 | 04:07 AM