ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Artificial Intelligence: ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్ ప్రారంభం.. అమల్లోకి కీలక సేవలు..

ABN, Publish Date - Mar 06 , 2025 | 08:36 PM

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం 'ఇండియా ఏఐ కంప్యూట్' పోర్టల్‌, డేటాసెట్ ప్లాట్‌ఫామ్ 'ఏఐకోష్'ని ప్రారంభించారు. ఇవి ఏఐ రంగంలో కీలక పాత్ర పోషించనున్నాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

Ashwini Vaishnaw

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) గురువారం 'ఇండియా ఏఐ కంప్యూట్' పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం 'ఇండియా ఏఐ మిషన్'కు ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహించారు. ఈ పోర్టల్ విద్యార్థులు, స్టార్టప్‌లు, పరిశోధకులు, విద్యావేత్తలు, ప్రభుత్వ విభాగాలకు 18,000 కంటే ఎక్కువ GPUలు, క్లౌడ్ స్టోరేజ్, ఇతర AI సేవలను అందించడంలో సాహాయం చేస్తుంది. ఈ పోర్టల్ ప్రధానంగా AI టెక్నాలజీని అందరికీ చేరువచేసి, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ పోర్టల్ ద్వారా AI వాడకం కోసం అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉంటుంది.


పోర్టల్‌లో నాణ్యత గల డేటాసెట్‌లు కూడా ఉన్నాయి. దీని ద్వారా AI మోడళ్లను రూపొందించడానికి, వీటిని వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించడానికి అవకాశం ఉంది. దీంతోపాటు మంత్రి 'ఏఐకోష్' ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించారు. ఇది డేటాసెట్‌లు, ఇతర శక్తివంతమైన వనరులతో కూడిన ఆవిష్కరణలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన సేవలను అందిస్తుంది. ఈ క్రమంలో 'ఇండియా ఏఐ మిషన్' ద్వారా భారతదేశం మరింత AI ఆవిష్కరణలను అందించే ప్రణాళికలను అమలు చేయనుంది. AI కోణంలో ఈ వేదికలు భారతదేశానికి ప్రత్యేకమైన, సొంత మౌలిక సదుపాయాల రూపకల్పనకు అవకాశం కల్పిస్తాయి. తద్వారా భారతదేశం అత్యాధునిక AI మోడల్‌లతో ప్రపంచంలోనే మరింత ప్రభావాన్ని చూపించనుంది.


భారతదేశం సొంత మౌలిక సదుపాయాలున్న ఐఏ నామునాకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు అశ్విని వైష్ణవ్. అంతేకాదు ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు 67 దరఖాస్తులు వచ్చాయన్నారు. భారత్ చంద్ర మిషన్‌ను తక్కువ ఖర్చుతో చేసిందని, అదే విధంగా ప్రాథమిక AI మోడల్‌ విషయంలో కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తామని కేంద్ర మంత్రి అన్నారు. భారతదేశం ఇతర దేశాల కంటే చాలా తక్కువ ఖర్చుతో దీనిని నిర్మించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వచ్చే మూడు నాలుగు ఏళ్లలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పోటీ పడగల సొంత GPUలను కలిగి ఉంటుందని వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ GPUలను ఉపయోగించడానికి అయ్యే ఖర్చు చారిత్రాత్మకంగా గంటకు రూ. 100 కంటే తక్కువగా ఉండాలని ఆయన తెలిపారు. కంప్యూట్ పోర్టల్ ప్రారంభం ద్వారా దేశవ్యాప్తంగా AI అమలు, విస్తరణ విధానాన్ని మెరుగుపరుస్తుందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. గత ఏడాది మార్చిలో కేంద్ర మంత్రివర్గం ఇండియా AI మిషన్‌ కోసం రూ. 10,371.92 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. ఈ మిషన్ ద్వారా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా AI ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది.


ఇవి కూడా చదవండి:

New AI: డీప్‌సీక్, ఓపెన్ ఏఐలకు పోటీకి కొత్తగా మరో ఏఐ..

Spam Calls: స్పామ్ కాల్స్ కట్టడి కోసం కీలక చర్యలు.. రోజుకు 13 మిలియన్ల కాల్స్ బ్లాక్

Alert: ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్, టీసీఎస్ నియమాల్లో కీలక మార్పులు..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 06 , 2025 | 08:37 PM