ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AFG Vs Aus Rain Disruption: ఆఫ్ఘనిస్థాన్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్ష గండం! అదే జరిగితే..

ABN, Publish Date - Feb 28 , 2025 | 01:59 PM

ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దైతే ఆప్ఘానిస్థాన్ సెమీస్ అవకాశాలు కనుమరుగవుతాయని పరిశీలకులు అంటున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ వేదికగా జరగనున్న ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ ఆస్ట్రలియా మ్యాచ్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. వర్షం పడే అవకాశం మెండుగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రద్దైతే ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్‌పై విజయంతో దూకుడుమీదున్న ఆఫ్ఘనిస్థాన్ కొత్త చరిత్ర సృష్టించేందుకు పలు వ్యూహాలతో రెడీగా ఉంది. మరోవైపు, కీలక ప్లేయర్లు లేకున్నా ముఖ్యమైన మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే టీమ్ ఆస్ట్రేలియా గేమ్ ఎలా ఉండబోతోంది అన్న ఉత్కంఠ కొనసాగుతోంది (Afghan Vs Australia Champions Trophy 2025).

లాహోర్‌లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. స్థానిక శాఖ ప్రకారం, అయితే, రోజు గడిచే కొద్దీ వర్షాపాతానికి అవకాశాలు తగ్గుతాయి. సోషల్ మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం అక్కడ ఆకాశం మేఘావృతం అయివుంది. దీంతో, తదుపరి ఏం జరుగుతుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.


‘వన్‌ లాస్ట్‌ టైమ్‌’ !

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్‌ బీలో ప్రస్తుతం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నాయి. ఒకే వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌కు చెరో ఒక పాయింట్ దక్కుతుంది. దీంతో, ఆస్ట్రేలియా 4 పాయింట్లు, ఆఫ్ఘనిస్థాన్ మూడు పాయింట్లకు చేరుకుంటాయి. అంటే, ఆఫ్ఘనిస్థాన్ సెమీస్ బెర్త్ కోల్పోవాల్సి వస్తుందన్న మాట. ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా మ్యాచ్ ఓడిపోయినా సెమీస్ ఫలితంపై పెద్దగా ప్రభావం ఉందని, ఆస్ట్రేలియా సెమీస్‌లో కాలుపెట్టడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

మ్యాచ్ జరిగితే మాత్రం ఇరు దేశాల మధ్య ఆట రసవత్తరంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అంచనాలేమీ లేకుండా ఆటలో దిగిన ప్రత్యర్థులను సర్‌ప్రైజ్ చేయడం ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్థాన్‌కు పరిపాటిగా మారింది. తాము ఇక ఎంత మాత్రం పసికూనలం కాదని ఇప్పటికే ఆ జట్టు పలుమార్లు రుజువు చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ విశ్వరూపమే చూపించింది. 177 పరుగులతో ఇబ్రహీమ్ జడ్రాన్, 5 వికెట్లు తీసిన అజ్మతుల్లా ఓమర్‌జాయ్, హాషీదీ సారథ్యం వెరసి ఆఫ్ఘనిస్థాన్‌కు విజయం కట్టపెట్టాయి.


టీమిండియా భారీ విరాళం.. మనసులు గెలిచారు బాస్

ఇక ఆస్ట్రేలియాలో కీలక ప్లేయర్లు మిస్సైనా కూడా కంగారూలను తక్కువగా అంచనా వేయలేకూడదేందుకు చరిత్రలో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. అయితే, కంగారుల పేస్ లైనప్ కాస్త బలహీనంగా ఉంది. మిడిల్ ఆర్డర్‌లో కూడా తడబాటు కనిపిస్తుండటంతో ఆఫ్ఘనిస్థాన్.. తన ప్రత్యర్థి లోటుపాట్ల నుంచి ప్రయోజనం పొందేందుకు తప్పనిసరిగా ప్రయత్నిస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 28 , 2025 | 02:09 PM