‘వన్ లాస్ట్ టైమ్’ !
ABN , Publish Date - Feb 28 , 2025 | 01:57 AM
మరో మూడు వారాల్లో వేసవి ధమాకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 10 రోజుల ప్రీ టోర్నీ క్యాంప్‌ను గురువారం ఇక్కడ ప్రారంభించింది...
ధోనీ టీ షర్ట్‌పై సంకేత భాష
మహీకిదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు
చెన్నై: మరో మూడు వారాల్లో వేసవి ధమాకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 10 రోజుల ప్రీ టోర్నీ క్యాంప్‌ను గురువారం ఇక్కడ ప్రారంభించింది. శిబిరంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎ్‌సకే సూపర్ స్టార్ ధోనీకి ఫ్రాంచైజీ ఘనంగా స్వాగతం పలికింది. అయితే ఈ సందర్భంగా..ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్మెంట్‌పై ఒక్కసారిగా ఊహాగానాలు హల్‌చల్ చేశాయి. అందుకు కారణంగా ధోనీ ధరించిన నల్ల టీ షర్ట్‌పై ఉన్న సంకేత భాషే. టెలి కమ్యూనికేషన్ వ్యవస్థలో ఉపయోగించే ‘మోర్స్ కోడ్’ ధోనీ టీషర్ట్‌పై ఉంది. మోర్స్ కోడ్ అంటే డాట్‌లు, డాష్‌లతో కూడిన సంకేత భాష. మహీ టీ షర్ట్‌పై ఉన్న ఆ కోడ్‌ను డీ కోడ్ చేస్తే ‘వన్ లాస్ట్ టైమ్’ అని వచ్చింది. అంతే..మహీ ఆడే చివరి ఐపీఎల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్త వ్యాపించింది. అయితే ఏదో టీ షర్ట్ ధరించినంత మాత్రాన అదే ఆఖరని భావించరాదని, వచ్చే ఏడాది ధోనీ ‘ఇంకొద్ది కాలం’ అని అర్ధం వచ్చేలా మరో టీ షర్ట్ ధరించి ఐపీఎల్ ఆడేస్తాడంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు.
ఇవీ చదవండి:
టీమిండియా భారీ విరాళం.. మనసులు గెలిచారు బాస్
రోహిత్ సేనపై కుట్ర.. ఫలితం అనుభవించారు
కన్నీళ్లు పెట్టుకున్న నంబర్ వన్ క్రికెటర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి