ఫొటోలు పంచుకున్న శైలేశ్
ABN, Publish Date - May 04, 2025 | 11:31 AM
హీరో నాని, డైరెక్టర్ శైలేశ్ కొలను కాంబోలో వచ్చిన చిత్రం హిట్-3. ఈ మూవీ షూటింగ్‌లో నాని తలకు గాయమైనట్లు ఇప్పటికే టీమ్ చెప్పింది. దీనికి సంబంధించిన విజువల్స్‌ను తాజాగా ట్విట్టర్‌లో శైలేశ్ పంచుకున్నారు. ‘‘తలకు గాయమైనప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తర్వాతి షాట్ కోసం నాని టైమ్‌కు సెట్‌లోకి వచ్చారు. సినిమాపై ఆయనకు ఉన్న ప్రేమ వెలకట్టలేనిది’’ అని పేర్కొన్నారు.
Updated Date - May 04, 2025 | 11:31 AM