భారీ వర్షం...ఊడిపడిన పెచ్చులు
ABN, Publish Date - Apr 03, 2025 | 06:59 PM
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. వర్షం కురుస్తున్న సమయంలోనే చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులు ఒక్కసారిగా కిందపడ్డాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన పర్యాటకులు అక్కడ్నుంచి పరుగులు పెట్టారు. గతంలో రిపేర్ చేసిన మినార్ నుంచి పెచ్చులు ఊడిపడినట్లు నిర్ధారణ అయింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Updated Date - Apr 03, 2025 | 06:59 PM