డెల్టా ఎయిర్‌లైన్స్‌లో అగ్ని ప్రమాదం
ABN, Publish Date - Apr 22, 2025 | 08:52 AM
ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులను అత్యవసర స్లయిడ్‌ల ద్వారా అధికారులు కిందకు దించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. అట్లాంటాకు వెళ్లాల్సిన విమానం రన్‌వే వైపు బయలుదేరిన వెంటనే రెండు ఇంజిన్లలో ఒకదానికి మంటలు అంటుకున్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మనిస్ట్రేషన్ వెల్లడించింది.
Updated Date - Apr 22, 2025 | 08:52 AM