ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Wells: బావులన్నీ వలయాకారంలోనే ఉంటాయి? ఇలా ఎందుకని డౌటొచ్చిందా?

ABN, Publish Date - Jan 27 , 2025 | 09:09 AM

బావులు ఎప్పుడూ చక్రాకారంలోనే తవ్వుతారు. దీని వెనక పలు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి రోజూ ఎన్నో విషయాలను వింటుంటాం. మరెన్నిటినో చూస్తుంటాం. కానీ అవేవీ మనసుపై పెద్దగా ప్రభావం చూపించవు. రోజు చూసేవే కదా అని మరికొన్నింటిని మనమే పట్టించుకోము. అలాంటి వాటిల్లో నీటి బావులు కూడా ఒకటి. దాదాపు బావులన్నీ వలయాకారంలోనే ఉంటాయి. ఇలా ఎందుకు అనే సందేహం కొందరిలో కలిగినా విషయాన్ని అక్కడితో వదిలేస్తారు. అయితే, దీని వెనక చాలా పెద్ద కారణమే ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి అదేంటో ఈ కథనంలో చూద్దాం (Why Wells are circular).

బావులను వలయాకారంలోనే నిర్మిస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే తీరు. వాస్తవానికి బావులను ఏ కారంలోనైనా నిర్మించొచ్చు. త్రికోణాకారం, నలుచదర ఆకారం ఇలా ఇష్టారీతిన నిర్మించుకోవచ్చు. కానీ చక్రకారంలో ఉన్న బావులతో పోలిస్తే ఇవి ఎక్కువ కాలం మనలేవు. స్వల్ప వ్యవధిలోనే గోడలు కూలిపోతాయని నిపుణులు చెబుతున్నారు (Viral).


Pesticide: భార్య చెప్పినా వినక.. చేతులు కడుక్కోకుండా భోజనం చేసి యువకుడి దుర్మణం!

త్రీకోణం లేదా నలు చదరం వంటి ఆకారంలో నిర్మిస్తే కార్నర్న్ వస్తాయి. ఈ మూలల్లో నీటి కారణంగా ఒత్తిడి అధిగమవుతుంది. దీంతో, బీటికలు ఏర్పడి క్రమంగా బావి గోడ మొత్తం విస్తరిస్తాయి. చూస్తుండగానే బాలి కుప్ప కూలుతుంది.

వలయాకారంలో బావిని నిర్మిస్తే ఈ బెడద ఉండదు. నీటి ఒత్తి గోడలపై అన్ని వైపులా సమాంతరంగా విస్తరిస్తుంది. ఫలితంగా బావి కొన్ని దశాబ్దాల పాటు నిలిచి ఉంటుంది. కాబట్టి, వలయాకారంలో నిర్మించే గోడలు మిగతా ఆకారాలతో పోలిస్తే దృఢంగా ఉంటాయి. ఇక వీటి నిర్మాణం కూడా చాలా సులభం. తక్కువ ఖర్చు, సిబ్బందితో పని పూర్తి చేసుకోవచ్చు.


Kumbhmela Monalisa: కుంభమేళా మోనాలిసాను వదలని ఇబ్బందులు.. సోషల్ మీడియాతో డబ్బు ఆర్జిద్దామనుకుంటే..

ఇక నీటిని తోడే సమయంలో పంపులు, బకెట్స్ వల్ల వలయాకార గోడలపై ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బావిని వలయాకారంలో తవ్వడం కూడా చాలా సులభం. తక్కువ జాగాలో ఎక్కువ నీటిని తోడుకునే అవకాశం ఉంటుంది. అందుకే ప్రపంచంలో అన్ని చోట్లా బావులను వలయాకారంలోనే తవ్వుతారు.

ఇక ప్రపంచంలోనే అత్యంత పురాతన బావి సైప్రస్‌లో ఉంది. 8 మీటర్ల లోతున్న ఈ బావిని క్రీస్తు పూర్వం 8400వ సంవత్సరంలో నిర్మించారని చెబుతారు. ఇక రష్యాలోని కోలా సూపర్ డీప్ బోరు అత్యంత లోతైనదిగా చెబుతారు. దీన్ని ఏకంగా 12 కిలోమీటర్ల లోతు వరకూ తవ్వారు. పరిశోధన కోసం 1970ల్లో దీన్ని తవ్వారు.

Read Latest and Viral News

Updated Date - Jan 27 , 2025 | 09:09 AM