Pope Francis: పోప్ మరణం.. ఆ ఉంగరం ప్రత్యేకత ఏంటో తెలుసా..
ABN, Publish Date - Apr 21 , 2025 | 06:04 PM
Pope Francis: పోప్ ధరించిన ఫిషర్‌మ్యాన్ ఉంగరాన్ని విరగ్గొట్టేస్తారు. ఫిషర్‌మ్యాన్ ఉంగరం వెనుక కూడా వందల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రజలు పోప్‌ను కలిసినపుడు ఆయన చేతికి ఉండే ఉంగరాన్ని ముద్దాడుతారు. అలా ఉంగారాన్ని ముద్దాటం అంటే జీసస్‌ను ముద్దాడటం అని జనం నమ్మకం.
రోమన్ క్యాతలిక్ చర్చి పెద్ద పోప్ ప్రాన్సిస్ సోమవారం ఉదయం 7.35 గంటలకు చనిపోయిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 88 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. 4 నుంచి 6 రోజుల్లో పోప్ అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. వందల ఏళ్లుగా పాటిస్తున్న ఆచారాల ప్రకారమే పోప్ అంత్యక్రియలు జరగనున్నాయి. పోప్ చనిపోయాడని తెలిసిన వెంటనే.. ఆయన నివసించిన ఇంటి తలుపుల్ని మూసేస్తారు. ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా చూసుకుంటారు. పోప్ ధరించిన ఫిషర్‌మ్యాన్ ఉంగరాన్ని విరగ్గొట్టేస్తారు. ఫిషర్‌మ్యాన్ ఉంగరం వెనుక కూడా వందల ఏళ్ల చరిత్ర ఉంది.
ఉంగరం చరిత్ర ఇది
మత్స్యకారుడు చేపలు పడుతున్నట్లుగా బంగారు ఉంగరంపై బొమ్మ ఉంటుంది. జీసస్ మొదటి అనుచరుడు ఓ మత్స్యకారుడు. అంతేకాదు.. జీసస్ కూడా చేపలు పట్టడంలో ఆరితేరిన వ్యక్తి. మొదటి పోప్ అయిన పీటర్ జీసస్ నుంచి చేపలు పట్టుకోవడం నేర్చుకున్నాడు. అందుకే ప్రతీ పోప్ మత్స్యకారుడి బొమ్మ ఉండే ఉంగరం ధరించటం ఆనవాయితీగా మారింది. పోప్ చనిపోయిన తర్వాత లేదా రిటైర్ అయిన తర్వాత ఆ ఉంగారాన్ని బద్ధలు కొట్టేస్తారు. కొత్తగా పోప్ అయిన వారు కొత్త ఉంగారాన్ని ధరిస్తారు. ప్రజలు పోప్‌ను కలిసినపుడు ఆయన చేతికి ఉండే ఉంగరాన్ని ముద్దాడుతారు. అలా ఉంగారాన్ని ముద్దాటం అంటే జీసస్‌ను ముద్దాడటం అని జనం నమ్మకం.
అంత్యక్రియలు ఇలా జరుగుతాయి..
పోప్‌లు బతికి ఉన్నపుడే .. తాము చనిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేయాలో చెప్పాల్సి ఉంటుంది. ఒక వేళ వారు ఏ నిర్ణయమూ తీసుకోకపోతే.. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికాలో సమాధి చేస్తారు. పోప్ చనిపోయిన 4 నుంచి 6 రోజుల్లో అంత్యక్రియలు పూర్తవుతాయి. అంత్యక్రియల తర్వాత 9 రోజుల పాటు సంతాప దినాలు జరుగుతాయి. అన్ని క్యాతలిక్ చర్చిలలో మౌనం పాటిస్తారు. సంతాప దినాలు పూర్తయిన తర్వాత కొత్త పోప్ ఎంపిక ఉంటుంది. ఇది సాధారణంగా 15 నుంచి 20 రోజుల్లో మొదలవుతుంది.
ఇవి కూడా చదవండి
Gold Rate: ఈ 6 దేశాల్లో బంగారం ధర ఇండియా కంటే చాలా తక్కువ
Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నుంచి వీరికి పట్టిందల్లా బంగారమే..
Updated Date - Apr 21 , 2025 | 06:04 PM