ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: బాత్‌రూమ్‌లో మహిళను నగ్నంగా చిత్రీకరించిన వ్యక్తి.. చివరికి ట్విస్ట్ తెలిసి అంతా షాక్..

ABN, Publish Date - Jan 26 , 2025 | 11:11 AM

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా సీసీ కెమెరాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇళ్లు, ఆఫీసులు వంటి ప్రాంతాల్లో చాలా మంది సీక్రెట్ కెమెరాలు పెడుతుంటారు. పోలీసులు సైతం వీటి ద్వారా అనేక మంది నేరస్థులను పట్టుకుంటున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా సీసీ కెమెరాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇళ్లు, ఆఫీసులు వంటి ప్రాంతాల్లో చాలా మంది సీక్రెట్ కెమెరాలు పెడుతుంటారు. పోలీసులు సైతం వీటి ద్వారా అనేక మంది నేరస్థులను పట్టుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో కాలేజీలు, హోటల్స్, మాల్స్ వంటి ప్రాంతాల్లో కొంతమంది కేటుగాళ్లు రహస్య కెమెరాలను అమర్చి మహిళను అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారు. ఆ వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అయితే ఓ మహిళను నగ్నంగా చిత్రీకరించాడనే ఆరోపణలతో ఓ యువకుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. అతన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. చివరికి అక్కడ చోటు చేసుకున్న ట్విస్ట్ చూసి అంతా అవాక్కయ్యారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడి వెంట కొంతమంది వ్యక్తులు పడ్డారు. కార్లు, బైకులతో అతన్ని చేజ్ చేశారు. అతను తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా.. వదిలిపెట్టకుండా వెంటపడి మరీ తరిమారు. బెంగళూరు రోడ్లన్నీ తిప్పించారు. బైక్ అదుపుతప్పి పడిపోవడంతో యువకుడిని పట్టుకున్నారు. తప్పించుకునేందుకు వీలు లేకుండా రౌండప్ చేశారు. ఒక్కసారిగా అంతా కలిసి దాడి చేశారు. ఇష్టం వచ్చినట్లు పిడిగుద్దులు కురిపించారు. కాళ్లతో తంతూ తీవ్రంగా కొట్టారు. ఓ మహిళ సైతం యువకుడిని చెప్పుతో కొట్టింది. తన జీవితం నాశనం చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.


అయితే అసలు విషయం ఏంటని పోలీసులు ఆరా తీశారు. దాడికి గురైన వ్యక్తి తన భార్యను నగ్నంగా చిత్రీకరించాడని ఓ వ్యక్తి పోలీసులకు చెప్పాడు. నిందితుడు గ్రీజర్ రిపేర్ నెపంతో తమ ఇంట్లోకి ప్రవేశించి బాత్ రూమ్‌లో సీసీ కెమెరా పెట్టినట్లు పోలీసులకు వివరించాడు. ఈ విషయం స్వయంగా భార్యే తనకు చెప్పినట్లు బాధితుడు వాపోయాడు. అయితే గ్రీజర్‌లో సీసీ కెమెరాలు పెట్టే అవకాశమే లేదు. ఎందుకంటే స్విచ్ ఆన్ చేసినప్పుడు అది విపరీతంగా వేడెక్కుతుంది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సదరు మహిళ ప్రశ్నించారు. ముందు నిజం చెప్పేందుకు తటపటాయించిన ఆమె.. ఖాకీలు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెల్లడించింది. నిందితుడికి, తనకు వివాహేతర సంబంధం ఉందని, అతని కోరిక మేరకు తానే వీడియో రికార్డు చేసి పంపినట్లు విచారణలో ఒప్పుకుంది. భర్త గట్టిగా ప్రశ్నించడంతో అతని పేరు చెప్పినట్లు తెలిపింది. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

Updated Date - Jan 26 , 2025 | 12:38 PM