Viral News: ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కైన ఉపాధ్యాయులు.. వామ్మో అసలు ఇలా ఉన్నారేంటి..
ABN, Publish Date - Jan 20 , 2025 | 08:16 AM
రాజస్థాన్ రాష్ట్రం చిత్తోర్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. గంగార్ బ్లాక్‌లోని సలేరాలోని ప్రభుత్వ సీనియర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మహిళా ఉపాధ్యాయురాలు తమ కర్తవ్యాన్ని మరచి ప్రేమలో మునిగిపోయారు. టీచర్‌తో సాన్నిహిత్యం పెంచుకున్న ప్రిన్సిపల్ ఆమెతో శృంగారంలో మునిగితేలాడు.
రాజస్థాన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విచక్షణ కోల్పోయారు. ఏకంగా పాఠశాలలోనే రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఆ ఇద్దరు టీచర్లు చేసిన పనికి సభ్యసమాజం ముక్కున వేలేసుకుంటోంది. వారి చేష్టలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఘటనపై విద్యాశాఖ సీరియస్ అయ్యింది. వారిద్దరినీ విధుల నుంచి తొలగించింది. కాగా, ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
రాజస్థాన్ రాష్ట్రం చిత్తోర్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. గంగార్ బ్లాక్‌లోని సలేరాలోని ప్రభుత్వ సీనియర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మహిళా ఉపాధ్యాయురాలు తమ కర్తవ్యాన్ని మరచి ప్రేమలో మునిగిపోయారు. టీచర్‌తో సాన్నిహిత్యం పెంచుకున్న ప్రిన్సిపల్ ఆమెతో శృంగారంలో మునిగితేలాడు. ఉన్న స్థానాన్ని, వయస్సును మరచి ఇద్దరూ హద్దులు మీరారు. ఏకంగా పాఠశాలలోనే పలుమార్లు రొమాన్స్ చేసి దొరికిపోయారు. ముద్దులు పెట్టుకుంటూ, అసభ్యంగా కౌగిలించుకుంటూ కామక్రీడలతో రెచ్చిపోయారు. వికృత చేష్టలతో ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రిన్సిపల్ గదిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
కాగా, గతేడాది డిసెంబర్‌లో రికార్డు అయిన ఈ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వీరి వ్యవహారానికి సంబంధించిన వీడియోలు చూసిన సలేరా గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులే ఇలా ఉంటే తమ పిల్లలను పాఠశాలకు ఎలా పంపించాలంటూ ఆందోళనకు దిగారు. ఈ విషయం కాస్త, జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఉపాధ్యాయులిద్దరినీ సస్పెండ్ చేసి ఘటనపై విచారణకు ఆదేశించారు. కాగా, టీచర్ల శృంగారానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్‌గా మారాయి. అయితే పెద్ద వయస్సు ఉన్న ఉపాధ్యాయులే యువకుల్లా ఇలాంటి పాడుపని చేయడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Viral Video: వామ్మో..! ఇదేంట్రా బాబోయ్.. రైల్లో సీటు కోసం వీళ్లు చేస్తున్న నిర్వాకం చూస్తే..
Viral Video: హైనాలే కదా అని తక్కువ అంచనా వేస్తున్నారా.. ఈ సింహం పరిస్థితి ఏమైందో చూడండి..
Updated Date - Jan 20 , 2025 | 08:24 AM