ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఇది 1బీహెచ్‌కే ఇల్లు అట.. బెంగళూరులో పరిస్థితి మరీ ఇంతగా దిగజారిందా?

ABN, Publish Date - Feb 10 , 2025 | 06:08 PM

చిన్న బాత్‌రూం అంత కూడా లేని ఓ ఇంటి రెంట్ రూ.25 వేలని చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. బెంగళూరులో ఉన్న ఈ ఇంటిని చూసి జనాలు షాకైపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు అంటే భారత దేశ సిలికాన్ వ్యాలీ. అయితే ఇక్కడి భయానక ట్రాఫిక్ రద్దీ, ఆకాశాన్నంటే ఇళ్ల అద్దెలకు కూడా నగరం పర్యాయపదంగా మారింది. అయితే, పరిస్థితి నానాటికీ దిగజారుతోందనే సూచనగా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన ఫ్రెండ్ ఉంటున్న ఓ ఇంటిని వీడియో తీసిన వ్యక్తి దాన్ని నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇంటి విస్తీర్ణం, అద్దె చూసి జనాలు షాకైపోతున్నారు. పరిస్థితి ఇంతగా ముదిరిపోయిందా అంటూ నోరెళ్లబెడుతున్నారు (Viral).


Viral: పాకిస్థానీ యువతితో భారతీయ యువకుడి ప్రేమ.. సరిహద్దు దాటాకా ఇక్కట్ల పాలు..

ఇది నా ఫ్రెండ్ 1బీహెచ్‌కే ఇల్లు, అద్దె రూ.25 వేలు అంటూ సదరు వ్యక్తి వీడియోను షేర్ చేశారు. పేరుకు అది 1బీహెచ్‌కే అయినా ఓ బాత్‌రూం అంత విస్తీర్ణం కూడా లేదు చేతుల పైకెత్తితే రెండు గోడలు తగులుతాయి. ఎల్లకిలపడుకుంటే తలకు, కాళ్లకు గోడలు తగిలేంత చిన్నగా ఉందా గది. ఆ గదికి ఆనుకుని ఉన్న బాల్కనీ మరింత చిన్నగా ఉంది. ఇద్దరు మనుషులు నిలబడేందుకు కూడా జాగా లేనట్టు కనిపించింది. ఈ వీడియో షేర్ చేసిన వ్యక్తి ఇంటిపై, దాని అద్దెపై పలు సెటైర్లు వేశారు. ఇందులో ఉండే వారు సామాన్లు కొనరని, కొత్త వస్తువులు పెట్టుకునే జాగానే లేదని అన్నారు. తద్వారా ఇందులో ఉండే వారికి డబ్బులు బాగా పొదుపుపవుతాయని అన్నాడు.


Viral: సంరక్షకుడికి ఏనుగు తుది వీడ్కోలు.. హృదయాన్ని కదిలించే వీడియో

బాత్‌రూం అంత విశాలంగా కూడా లేని ఇంటికి ఏకంగా రూ25 వేల అద్దె అని తెలిసి జనాలు షాకైపోతున్నారు. పరిస్థితి ఇంతగా ముదిరిపోయిందా అని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం ఇంట్లో కిచెన్ హాల్ లేని విషయాన్ని గుర్తుపట్టారు. అవి ఎక్కడు ఉన్నాయని ప్రశ్నించారు. ముంబై పరిస్థితి కూడా దాదాపు ఇంతేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. బ్యాచిలర్ల స్వర్గధామమని కొందరు, సింపుల్‌గా జీవించడమంటే ఇదే అని మరికొందరు కామెంట్ చేశారు. బంధువుల రొద, పనిమనిషి అవసరం ఉండని ఒకే ఒక ఇల్లు ఇదని కొందరు ఛలోక్తులు విసిరారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. జనాలు షాకైయ్యేలా చేస్తోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Read Latest and Viral News

Updated Date - Feb 10 , 2025 | 06:10 PM