Share News

Viral: పాకిస్థానీ యువతితో భారతీయ యువకుడి ప్రేమ.. సరిహద్దు దాటాకా ఇక్కట్ల పాలు..

ABN , Publish Date - Feb 09 , 2025 | 07:41 PM

ఫేస్‌బుక్ ద్వారా పాక్ యువతి ప్రేమలో పడ్డ ఓ 20 ఏళ్ల భారతీయ యువకుడు చివరకు పాకిస్థాన్ చేరి ఇక్కట్ల పాలయ్యాడు. అతడి ప్రేమను యువతి తిరస్కరించడంతో ఇబ్బందుల్లో పడి చివరకు పాక్ పోలీసులకు చిక్కాడు. అతడి కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.

Viral: పాకిస్థానీ యువతితో భారతీయ యువకుడి ప్రేమ.. సరిహద్దు దాటాకా ఇక్కట్ల పాలు..

ఇంటర్నెట్ డెస్క్: భారతీయుడి ప్రేమలో పడి నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చిన సీమా హైదర్ గురించి చాలా మందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఇలాంటి మరో లవ్ స్టోరీ తాజాగా వెలుగులోకి వచ్చింది. పాకిస్థానీ యువతితో ప్రేమలో పడ్డ ఓ 20 ఏళ్ల యువకుడు దాయాది దేశంలో అక్రమంగా చేరి చివరకు ఇక్కట్ల పాలయ్యారు. ప్రస్తుతం అతడి కేసు కోర్టుకు చేరుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన బాదల్ బాబుకు రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా సనా రాణి అనే పాకిస్థానీ యువతితో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. బాదల్ చివరకు ఆమె లేనిదే ఉండలేని స్థితికి చేరుకున్నాడు. ధైర్యాన్నంతా కూడ దీసుకుని దాయాదీ దేశంలో కాలుపెట్టాడు. అట్టారీ వాఘా బార్డర్ ద్వారా పాక్‌లోకి వెళ్లాడు. మతం కూడా మారి తన పేరును రీహాన్‌ అని పెట్టుకున్నాడు (Viral)..


Viral: సంరక్షకుడికి ఏనుగు తుది వీడ్కోలు.. హృదయాన్ని కదిలించే వీడియో

ఆ తరువాత అతడు గంపెడాశతో గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి చేరుకుంటే పరిస్థితి ఊహించిన మలుపు తిరిగింది. అతడి పరిస్థితి గురించి తెలుసుకున్న సనా అతడితో పెళ్లికి నిరాకరించింది. దీంతో, అతడు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయాడు. పొరుగు దేశంలో ఇరుక్కుపోయి ఏం చేయాలో తెలీక చివరకు పొట్ట కూటి కోసం సనా ఇంటికి సమీపంలో ఓ వ్యక్తి వద్ద గొర్రెల కాపరిగా పనిలో చేరాడు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 27న పోలీసుల తనిఖీల్లో అడ్డంగా బుక్కైపోయాడు. తనది కరాచీ అని అతడు చెప్పడంతో డౌటొచ్చిన పోలీసులు కూపీ లాగగా అతడి బండారం బయటపడింది.


Viral: భారత పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకుడిని మోసం చేసే ప్రయత్నం! చివరకు..

ప్రేమ కోసం చిక్కుల్లో పడిన ఈ యువకుడిని చూసి చలించిపోయిన ఓ లాయర్ మానవతా దృక్పథంతో అతడి కేసును వాదించేందుకు ముందుకొచ్చాడు. మతం మారిన అతడికి స్వదేశానికి తిరిగి వెళ్లడం ఇబ్బంది కరమని కోర్టులో వాదించాడు. ఇక యువకుడిని పనిలో పెట్టుకున్న వ్యక్తి కూడా అతడి ప్రేమ వ్యవహారం గురించి చెప్పాడు. తన వద్ద పనిలో చేరిన అతడు ఆ తరువాత కొద్ది రోజులకు ప్రేమ వ్యవహారం గురించి బయటపెట్టాడని అన్నాడు. యువకుడి ప్రేయసి సనా, ఆమె తల్లి బాదల్‌ను తొలుత తమ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించినా ఆ తరువాత తమకు ఈ సంబంధం తగినది కాదని భావించి తిరస్కరించినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అతడికి తన తల్లిదండ్రులో ఫోన్‌లో మాట్లాడేందుకు అనుమతించారు. కోర్టు ఆవరణలో చేతులకు బేడీలు వేసి ఉండగా అతడు తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడట. ఈ కేసుపై కోర్టు ఈ నెలాఖరులో మరోసారి విచారణ చేపట్టనుందని స్థానిక మీడియా చెబుతోంది.

Read Latest and Viral News

Updated Date - Feb 09 , 2025 | 07:46 PM