ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Couple next to Dead body on Flight: జంటకు షాకింగ్ అనుభవం.. విమానంలో డెడ్ బాడీ పక్కను కూర్చుని ప్రయాణం

ABN, Publish Date - Mar 01 , 2025 | 10:23 AM

ఖతర్ ఎయిర్‌వేస్‌ విమానంలో ఓ జంట మృతదేహం పక్కను కూర్చుని ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇటీవల మెల్బోర్న్ నుంచి దోహా వెళ్లిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇంటర్నెట్ డెస్క్: విమానంలో మహిళ మృతదేహం పక్కన కూర్చుని దంపతులు ప్రయాణించిన షాకింగ్ ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఖతర్ ఎయిర్‌వేస్‌లో తమకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ రింగ్, జెన్నిఫర్ కాలిన్ దంపతులు ఇటీవల ఖతర్ ఎయిర్ వేస్‌ విమానంలో మెల్బోర్న్ నుంచి దోహా వెళుతుండగా ఈ ఘటన జరిగింది (Couple next to Dead body on Qatar Airways Flight).

విమానం మరో 4 గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుందనగా ఈ ఘటన జరిగిందని వారు చెప్పుకొచ్చారు. విమానంలోని ఓ ప్రయాణికురాలు అకస్మాత్తుగా చనిపోవడంతో క్రూ సిబ్బంది ఆమెను సీట్ల మధ్య నుంచి తరలించే ప్రయత్నం చేశారన్నారు. చనిపోయిన మహిళ భారీ కాయురాలని తెలిపారు. ఈ క్రమంలో సిబ్బంది తనను పక్క సీటులో కూర్చుమని చెప్పి మృతదేహాన్ని పక్కనున్న సీటులో కూర్చోపెట్టారని తెలిపారు. తన భార్య మరో సీటులోకి మారాల్సి వచ్చిందని తెలిపారు.


Video Call with Employees: ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్.. ఇలా జరుగుతుందని బాస్ ఊహించి ఉండడు

అయితే, విమానంలో ఇంకా సీట్లు ఖాళీగా ఉన్నా తనను వాటిల్లో మార్చలేదని మిషెల్ తెలిపారు. ‘‘ప్రయాణికురాలు మృతి చెందడం విచారకరం. అయితే, ఇలాంటి సందర్భాలకు అనుగూణంగా ప్రొటోకాల్ ఉండాలి. కానీ విమానం సిబ్బంది ఇదేమీ ఫాలో అయినట్టు లేదు’’ అని సదరు ప్రయాణికుడు వాపోయారు.

విమానం దిగిన తరువాత కూడా ప్రయాణికులను సిబ్బంది కిందకు దిగనీయలేదని బాధిత జంట పేర్కొంది. మృతదేహాన్ని కిందకు దించే వరకూ తమను విమానంలోనే కూర్చోబెట్టారని వారు తెలిపారు. ‘‘వాళ్లు ఇలా అంటారని అస్సలు ఊహించలేదు’’ అని అన్నారు. ముందు ప్యాసెంజర్లను దింపేశాక మృతదేహాన్ని తరలించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.


బీహార్‌‌లో పోస్టింగ్.. కేంద్రీయ విద్యాలయ టీచర్‌ తిట్ల దండకం

అయితే, ఈ వాదనను ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా స్పందించింది. తమ సిబ్బంది నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్టు స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భాల్లో అన్ని ఎయిర్‌లైన్స్ అనుసరించే ప్రామాణిక పద్ధతినే తామూ అనుసరించినట్టు పేర్కొంది. ‘‘ప్యాసెంజర్లకు ఇబ్బంది కలగకుండా ఇతర సీట్లల్లోకి మార్చాము. విమానం ల్యాండయ్యే వరకూ మహిళ మృతదేహం పక్కనే సిబ్బంది కూర్చుని ప్రయాణించారు. మహిళ మరణం దురదృష్టకరమే అయినా అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో తగిన విధంగా స్పందించే విధంగా మా సిబ్బందికి శిక్షణ ఇచ్చాము’’ అని పేర్కొంది. అయితే, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఖతర్ ఎయిర్ వేస్ క్షమాపణ చెప్పింది. కస్టమర్ల సౌకర్యానికే తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది.

Read Latest and Viral News

Updated Date - Mar 01 , 2025 | 10:23 AM