Teacher Rant on Bihar: బీహార్‌లో పోస్టింగ్.. కేంద్రీయ విద్యాలయ టీచర్ తిట్ల దండకం
ABN , Publish Date - Feb 28 , 2025 | 07:55 AM
బీహార్‌లో పోస్టింగ్ ఇచ్చినందుకు ఓ టీచర్ తిట్ల దండకం అందుకుంది. భారత్‌లోనే అత్యంత చెత్త ప్రదేశంలో తనకు పోస్టింగ్ ఇచ్చారంటూ మండి పడింది. దీనిపై స్థానిక ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో
ఇంటర్నెట్ డెస్క్: బీహార్‌లో పోస్టింగ్ రావడం తట్టుకోలేకపోయిన ఓ కేంద్రీయ విద్యాలయ టీచర్ తిట్ల దండకం ఎత్తుకుంది. దేశ సరిహద్దుల్లో పోస్టింగ్ ఇచ్చినా బాగుండేదంటూ నోటి కుచ్చినట్టు బీహార్‌పై నోరు పారేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో బీహార్ ఎంపీ ఒకరు కేంద్రీయ విద్యాలయాల కమిషనర్‌కు లేఖ రాయడంతో సదరు టీచర్‌పై సస్పెన్ష్ వేటు పడింది (Viral).
దీపాలీ షా అనే కేంద్రీయ విద్యాలయ ప్రైమరీ టీచర్‌కు బీహార్‌లో జెహానాబాద్‌లో పోస్టింగ్ వచ్చింది. ఇది తట్టుకోలేకపోయిన ఆమె తన ఆవేశాన్నంతా నెట్టింట కక్కేసింది. భారత్‌లోని అత్యంత దారుణమైన ప్రాంతంలో తనకు పోస్టింగ్ వచ్చిందని, ఇక్కడి కంటే దేశ సరిహద్దుల్లో జాబ్ వచ్చినా బాగుండేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతూ నెట్టింట వీడియో పంచుకుంది. ప్రస్తుతం దీపాలీ షా ప్రొబేషన్‌పై ఉన్నారు (Kendriya Vidyalaya Teacher Rant on Bihar).
Top Viral Moments of Kumbhmela: మమాకుంభమేళా.. జనాల్ని ఆశ్చర్య పరిచిన టాప్ 10 ఉదంతాలు ఇవే
‘‘కేంద్రీయ విద్యాలయాల్లో బీహార్‌లో అనేక చోట్ల ఉన్నాయి. కొందరు కోల్‌కతాకు వెళ్లేందుకు ఇష్టపడరు. కానీ నేను అందుకు కూడా రెడీగానే ఉన్నాను. బెంగాల్‌తో నాకు ఎటువంటి సమస్య లేదు. నా ఫ్రెండ్స్ ఒకరికి డార్జీలింగ్‌లో పోస్టింగ్ ఇచ్చారు. మరికొందరికి ఈశాన్య ప్రాంతమైన సిల్చర్‌లో పోస్టింగ్ వచ్చింది. నాపై వారికున్న శత్రుత్వం ఏమిటో కానీ నాకు మాత్రం దేశంలో అత్యంత చెత్త ప్రాంతానికి పంపించారు’’
‘‘నన్ను గోవాకో, ఒడిశాకో, హిమాచల్ ప్రదేశ్‌కో లేదా దక్షిణాది చివరకు లద్దాఖ్‌కు పంపించినా బాగుండేది. బీహార్ ప్రజలకు అసలు పౌర స్పృహే ఉండదు. భారత్ ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా మిగిలిపోయిందంటే దానికి బీహార్ జనాలూ ఒక కారణం. బీహార్‌ను భారత్ నుంచి తొలగించిన రోజున మనం అభివృద్ధి చెందిన దేశంగా మారుతాము. ఇక్కడి వారికి అసలు పౌర స్పృహే లేదు. భారతీయ రైల్వేలను వీరే భ్రష్టు పట్టించారు’’ అంటూ వీడియో పోస్టు చేసింది. అనేక సందర్భాల్లో రాయలేని పదాలతో తిట్ల దండకం అందుకుంది.
Marry or Get Fired Ultimatum: పెళ్లి కాని వారిని ఉద్యోగం నుంచి తీసేస్తాం.. చైనా సంస్థ వార్నింగ్
ఈ ఉదంతం వైరల్ కావడంతో బీహార్‌లోని సమస్తీపూర్ ఎంపీ శాంభవి ఫైర్ అయిపోయారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రీయ విద్యాలయ కమిషనర్‌కు లేఖ రాశారు. ఓ టీచర్ అయ్యుండీ ఇలా మాట్లాడటం పద్ధతి కాదని అన్నారు. ఆమె కామెంట్స్ బీహార్ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. దీంతో, ఆమెను తక్షణం సస్పెండ్ చేస్తే కేంద్రీయ విద్యాలయ ప్రాంతీయ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.