Share News

Marry or Get Fired Ultimatum: పెళ్లి కాని వారిని ఉద్యోగం నుంచి తీసేస్తాం.. చైనా సంస్థ వార్నింగ్

ABN , Publish Date - Feb 25 , 2025 | 10:04 PM

ఒంటరిగా ఉన్న ఉద్యోగులు పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం లోంచి తీసేస్తామంటూ ఓ చైనా కంపెనీ ఊహించని వార్నింగ్ ఇచ్చింది. దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవడంతో చివరకు కంపెనీ వెనకడుగు వేసింది.

Marry or Get Fired Ultimatum: పెళ్లి కాని వారిని ఉద్యోగం నుంచి తీసేస్తాం.. చైనా సంస్థ వార్నింగ్

ఇంటర్నెట్ డెస్క్: సంతానోత్పత్తి రేటు పెంచేందుకు చైనా నానా తిప్పలు పడుతోంది. యువత వివాహాలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటించేందుకు అక్కడి సంస్థలు మరిన్ని చిక్కుల్లో పడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఉదంతం చైనాలో వెలుగు చూసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా పెళ్లి చేసుకోకపోతే జాబ్ లో నుంచి తీస్తేస్తామంటూ ఒంటరి ఉద్యోగులను హెచ్చరించిన ఆ సంస్థ చివరకు విమర్శలు పాలై వెనక్కు తగ్గాల్సి వచ్చింది ((Viral)).

చైనా సంప్రదాయిక విలువలను ప్రోత్సహించే పేరిట సదరు చైనా సంస్థ ఈ వింత పాలసీని ప్రవేశపెట్టింది. 28 నుంచి 58 ఏళ్ల లోపు ఒంటరి ఉద్యోగులందరూ మరో ఆరేడు నెలల్లో కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని చెప్పింది. ఒంటరిగా ఉన్న యువతతో పాటు డైవర్స్ తీసుకున్న వారికీ ఈ విధానం వర్తిస్తుందని స్పష్టం చేసింది.


Brawl In Airport: ఎయిర్‌పోర్టులో షాకింగ్ సన్నివేశం.. ప్రయాణికుల మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్

సంస్థ కొత్త విధానం ప్రకారం, మార్చి కల్లా ఒంటరి ఉద్యోగులు తమ ప్రయత్నాల్లో సక్సెస్ సాధించాలి. అలా జరగకపోతే అందుకు గల కారణాలను లిఖితపూర్వకంగా వివరించాలి. ఆ తరువాత సంస్థ వారికి జూన్ వరకూ మరో అవకాశం ఇస్తుంది. అప్పటికీ ఒంటరిగానే ఉంటే వారికి కౌన్సెలింగ్ గట్రా ఇచ్చి తరువాత మరో అవకాశం కూడా ఉదారంగా ఇస్తుంది. ఇన్ని చేసినా కూడా సెప్టెంబర్ తరువాత వారు ఒంటరిగా ఉన్నారంటే మాత్రం ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. చైనా సంప్రదాయిక విలువలను ప్రోత్సహించడమే ఈ విధానం వెనకున్న ఉద్దేశమని సంస్థ పేర్కొంది.


Viral: 145 ఏళ్ల నాటి టేబుల్ తొలగింపు.. మస్క్ తనయుడి దెబ్బకు ట్రంప్‌లో గుబులు పుట్టిందా..

ఈ అల్టిమేటమ్ చూసి సంస్థలో దాదాపు 1200 మంది ఒంటరి పక్షులు షాకైపోయాయి. సంస్థ ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ.. బలవంతపు పెళ్లి, కాపురాలను అంగీకరించబోమని తేల్చి చెప్పాయి. చివరకు విషయం బయటకుపొక్కి నానా రచ్చా అయ్యింది. ఏకంగా స్థానిక కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సంస్థ తీరు తప్పని స్వయంగా ప్రభుత్వం అంగీకరించాల్సి వచ్చింది. దీంతో, చేసేదేమీ లేక సంస్థ తన అల్టిమేటమ్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అయితే, చైనాలో పరిస్థితికి ఈ ఉదంతం అద్దం పడుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Read Latest and Viral News

Updated Date - Feb 25 , 2025 | 10:07 PM