Brawl In Airport: ఎయిర్‌పోర్టులో షాకింగ్ సన్నివేశం.. ప్రయాణికుల మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్
ABN , Publish Date - Feb 24 , 2025 | 08:21 AM
అట్లాంటాలోని ఓ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఘర్షణ పడ్డారు. ఘటనకు గల కారణం తెలియకపోయినా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: వ్యక్తుల మధ్య అభిప్రాయభేదాలు సహజం. ఒక్కోసారి ఇవి ఘర్షణకు కూడా దారి తీస్తాయి. అయితే, ఎయిర్‌పోర్టు లాంటి ప్రదేశాల్లో జనాలు కలబడి తన్నుకున్నారంటే కాస్తంత ఆశ్చర్యంగా ఉంటుంది. బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్‌లలో కనిపించే దృశ్యాలు ఎయిర్‌పోర్టులో ఆవిష్కృతమైతే నోరెళ్లబెట్టాల్సిందే. అందుకే ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో జనాలు చేసిన రభస చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు (Viral).
Viral: 145 ఏళ్ల నాటి టేబుల్ తొలగింపు.. మస్క్ తనయుడి దెబ్బకు ట్రంప్‌లో గుబులు పుట్టిందా..
జార్జియాలోని అట్లాంటా రాష్ట్రంలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టులో వెయింటింగ్ ప్రాంతంలో ఉన్న ప్రయాణికుల మధ్య అకస్మాత్తుగా పెద్ద గొడవ జరిగింది. డజన్ల కొద్దీ జనాలు కలబడి ఒకరిపై మరొకరు ముష్టిఘాతాలు, దెబ్బలు కురిపించుకున్న షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోర్డింగ్ గేటు వద్ద ఈ సీన్ కనిపించింది. పక్కనే ఉన్న మరికొందరు ఈ సీన్ చూసి షాకైపోయారు. కలబడి కొట్టుకుంటున్న ప్రయాణికులను ఆపే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. ఈ గొడవల్లో తమ పిల్లలకు ఏం కాకుండా ఉండేందుకు వారిని తల్లిదండ్రులు చేయిపట్టుకుని పక్కకు లాక్కొచ్చారు.
Relationship: ఇలాంటి వాళ్లకు వీలైనంత దూరంగా ఉండండి..లేకపోతే జీవితం నరకం
గొడవకు గల కారణమేంటో కూడా తెలియరాలేదు. అయితే, గొడవ సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేసినా వారు కాస్త ఆలస్యంగా వచ్చారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో, పోలీసులు వచ్చేలోపే ప్రయాణికులు అక్కడి నుంచి జారుకున్నారని చెప్పారు. మరోవైపు, ఘటనపై పోలీసులు కూడా స్పందించారు. తమకు సమాచారం అందిన వెంటనే ఆలస్యం చేయకుండా అక్కడికి వచ్చేశామని తెలిపారు. అయితే, అప్పటికే అక్కడ గొడవ సద్దుమణిగిందని, గొడవపడ్డ వారందరూ అక్కడి నుంచి పారిపోయారని అన్నారు.
Viral: ఒక్క తప్పు.. రాత్రికి రాత్రి మారిపోయిన మహిళ జీవితం
మరోవైపు, వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి జనాలు షాకైపోతున్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నదీ లేనిదీ పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అయితే, తదుపరి చర్యల కోసం ఎయిర్ పోర్టు అధికారులు, పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే, ఈ ఉదంతం జరిగిన హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా ఎయిర్‌పోర్టులో ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని స్థానిక మీడియా పేర్కొంది.