Share News

Viral: ఒక్క తప్పు.. రాత్రికి రాత్రి మారిపోయిన మహిళ జీవితం

ABN , Publish Date - Feb 22 , 2025 | 08:29 AM

లాటరీ షాపులోని వ్యక్తి చేసిన పొరపాటు కారణంగా ఓ మహిళ జీవితమే మారిపోయింది. బంపర్ లాటరీ తగలడంతో ఆమె ఏకంగా రూ.17 కోట్లు గెలుచుకుంది. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది.

Viral: ఒక్క తప్పు.. రాత్రికి రాత్రి మారిపోయిన మహిళ జీవితం

ఇంటర్నెట్ డెస్క్: తప్పులు, పొరపాట్లతో నష్టాలే తప్ప మేలు జరగదు. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళ జీవితంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. ఒక్క తప్పు కారణంగా ఆమె జీవితం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. రాత్రికి రాత్రికి ఆమె కోటీశ్వరురాలైపోయింది. తన జీవితంలో ఇంతకు మించి అద్భుతమైన తప్పు మరొకటి లేదంటూ ఆమె మీడియా ముందు సంబరపడిపోయింది (Viral).

వర్జీనియా రాష్ట్రానికి చెందిన కెల్లీ లిండ్సేకు ఓ తప్పు కారణంగా అదృష్టం వరించింది. లాటరీలో ఆమె ఏకంగా రూ. 17 కోట్లు గెలుచుకుంది. అంతకు కొన్ని రోజుల ముందు ఆమె లాటరీ టిక్కెట్టు కొనేందుకు స్థానికంగా ఉన్న ఓ షాపునకు వెళ్లింది. అక్కడ తనకు నచ్చిన టిక్కెట్ అడిగింది. కానీ షాపులోని వ్యక్తి మాత్రం పొరపాటు ఆమె కోరినది కాకుండా మనీ బ్లిట్జ్ స్క్రాచ్ ఆఫ్ కార్డు ఇచ్చారు. మొదట్లో కాస్త చిరాకు పడ్డా ఆ తరువాత కెల్లి సర్దుకుపోయింది.


IVF: బిడ్డ పుట్టాక బయట పడ్డ ఐవీఎఫ్ కేంద్రం పొరపాటు.. తల్లి షాక్

టిక్కెట్‌ తీసుకుని పార్కింగ్ స్థలంలోని తాను కారు వద్దకు వచ్చిన ఆమె లాటరీ టిక్కెట్ స్క్రాచ్ చేసి నెంబర్‌ను చూసి నోరెళ్లబెట్టింది. కారణంగ.. ఆ నెంబర్‌పై ఆమెకు బంపర్ లాటరీ తగలడమే. ఏకంగా 2 మిలియన్ డాలర్ల టాప్ ప్రైజ్ వచ్చినట్టు తెలుసుకున్న ఆమెకు సంతోషంతో నోట మాటరాలేదు. అప్పటిదాకా షాపులోని వ్యక్తిపై ఉన్న అసహనమంతా ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆమె సంబరం అంబరాన్ని అంటిందది. ఇంత గొప్ప పొరపాటు మళ్లీ తన జీవితంలో జరగదని కూడా ఆమె నిర్ధారణకు వచ్చేసింది.


City Killer Asteroid: భారీ గ్రహశకలంతో ముంబై, కోల్‌కతాకు ముప్పు ఉందా? నాసా ఏం చెప్పిందంటే..

లాటరీ నిబంధనల ప్రకారం, రెండు మిలియన్ డాలర్లు సంవత్సరానికి కొంత మొత్తం చొప్పున 30 ఏళ్ల పాటు తీసుకోవచ్చు. ఒకేసారి సెటిల్మెంట్ కోరే వారికి 1,250,000 డాలర్లను మాత్రమే చెల్లిస్తారు. కెల్లీ ఒన్ టైం సెటిల్మెంట్‌ను ఎంచుకుంది. అయితే, ప్రతి 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే మనీ బ్లిట్జ్ లాటరీ దక్కుతుందని లాటరీ సంస్థ పేర్కొంది.

అయితే ఈ లాటరీతో కెల్లీ జీవితంతో పాటు ఆమె ఉంటున్న ప్రాంతంలో కూడా భారీ మార్పులు వచ్చాయి. లాటరీ పన్ను రూపంలో భారీగా నిధులు సమకూరడంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడి పాలక సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ ఉదంతం విని స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అదృష్టం ఏ రూపంలో వరిస్తుందో చెప్పడం కష్టమని కామెంట్ చేశారు.

Read Latest and Viral News

Updated Date - Feb 22 , 2025 | 08:31 AM