Share News

City Killer Asteroid: భారీ గ్రహశకలంతో ముంబై, కోల్‌కతాకు ముప్పు ఉందా? నాసా ఏం చెప్పిందంటే..

ABN , Publish Date - Feb 19 , 2025 | 08:35 PM

నగరాలను తుడిచిపెట్ట కలిగే శక్తి ఉన్న గ్రహశకలం భూమిని ఢీకొనే ఛాన్స్ పెరిగిందని నాసా తాజాగా పేర్కొంది.

City Killer Asteroid: భారీ గ్రహశకలంతో ముంబై, కోల్‌కతాకు ముప్పు ఉందా? నాసా ఏం చెప్పిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఆవిర్భవించే సమయంలో భూమిని అనేక గ్రహశకలాలు ఢీకొన్నాయి. ఆ తరువాత జీవ పరిణామక్రమంలో డైనోసార్లు అంతరించిపోవడానికి కూడ గ్రహశకలం కారణం అయ్యండొచ్చని శాస్త్రవేత్తల అంచనా. డైనోసార్లు అంతర్థానం అయ్యాకే మానవ జాతి ఉనికిలోకి వచ్చింది. అయితే, సౌరకుటుంబంలోని అనేక గ్రహశకలాలు ఇప్పటికీ భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అమెరికా అంతరక్షి సంస్థ (నాసా) లెక్కగట్టింది. అంతేకాకుండా, నిత్యం వాటిపై ఓ కన్నేసి ఉంచుతూ ఎప్పటికప్పుడు అలర్ట్‌లు జారీ చేస్తుంటుంది. అయితే, ఇటీవల కనుగొన్న ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ఛాన్స్ 3.1 శాతానికి పెరిగిందని నాసా పేర్కొంది (City Killer Asteroid).


Viral: విడాకుల తీసుకున్న వెంటనే తోడు కోసం మహిళ ప్రయత్నం! జీవితం తలకిందులు

ఈ భారీ గ్రహశకలం పేరు 2024 వైఆర్4. ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే నగరాలకు నగరాలే నాశనమైపోతాయట. దీని పరిధిలోకి తూర్పు పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగం, అట్లాంటిక్ మహా సముద్రం, అరేబియా సముద్రం, దక్షిణాసియా ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన ముంబై, కోల్‌కతా, ఢాకా, బొగొటా, అబిడ్జాన్, లాగోస్, ఖార్తూమ్ నగరాలకు కూడా గ్రహశకలం కారణంగా ముప్పు పొంచి ఉందని నాసా తాజాగా పేర్కొంది. గ్రహశకలాల చలనాన్ని ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ వార్నింగ్ నెట్వర్క్ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నెట్వర్క్ పరిధిలోని అనేక టెలిస్కోపుల సాయంతో నాసా ఈ గ్రహశకలం ప్రయాణాన్ని గమనిస్తోంది. ఏప్రిల్ వరకూ దీన్ని భూమ్మీదున్న టెలిస్కోపుల ద్వారా చూడొచ్చు. ఆ తరువాత మళ్లీ 2028లోనే ఇది మనవాళికి కనిపిస్తుందట.


Anand Mahindra: టెస్లా ఎంట్రీతో పెరగనున్న పోటీపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్

ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం 2.3 శాతమని నాసా గతంలో ప్రకటించింది. తాజాగా ఈ ముప్పును 3.1 శాతానికి పెంచింది. ఈ ముప్పు స్వల్పమే అయినా మందుజాగ్రత్త చర్యగా గ్రహశకలాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నామని నాసా పేర్కొంది. 300 అడుగుల వెడల్పు, 130 అడుగుల పొడవు ఉన్న ఈ గ్రహశకలం భూమిని ఢీకొనని పక్షంలో గాల్లోనే మండిపోవచ్చని చెబుతున్నారు. భూమి వాతావరణంలోకి ప్రవేశించాక ఇది 8 మెటాటన్నుల టీఎన్‌టీ సమానమైన శక్తిని విడుదల చేస్తూ ఇది విస్ఫోటనం చెందుతుందట. హిరోషిమామీద వేసిన అణుబాంబు కంటే 500 రెట్లు అధిక శక్తిని విడుదల చేస్తుందట. భూమికి ముప్పు కలిగించే అత్యంత ప్రమాదకరమైన గ్రహశకలం ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైనోసార్లను తుదముట్టించిన గ్రహశకలం దాదాపు ఆరు మైళ్ల పొడవు ఉంటుంది. దీని వల్ల భూమి వాతావరణంలో దీర్ఘకాలిక మార్పులు వచ్చాయి. అయితే, 2024 వైఆర్4 కారణంగా ఆస్థాయి ప్రమాదం లేకపోయినా నగరాలు కచ్చితంగా తుడిచిపెట్టుకుపోతాయని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Read Latest and Viral News

Updated Date - Feb 19 , 2025 | 08:39 PM