Share News

Relationship: ఇలాంటి వాళ్లకు వీలైనంత దూరంగా ఉండండి..లేకపోతే జీవితం నరకం

ABN , Publish Date - Feb 23 , 2025 | 10:48 PM

ఏ రిలేషన్‌షిప్‌లో అయినా ఇలాంటి వాళ్లు తారసపడితే వెంటనే దూరం జరగాలని నిపుణులు చెబుతున్నారు.

Relationship: ఇలాంటి వాళ్లకు వీలైనంత దూరంగా ఉండండి..లేకపోతే జీవితం నరకం

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబసభ్యులు, స్నేహితులు, జీవితభాగస్వామి, తోటి ఉద్యోగులు ఇలా నిత్యం ఎంతో మంది మన చుట్టూ ఉంటారు. వీరిలో కొందరు పక్క ఉంటే ఆనందం మరికొందరితో చికాకు కలుగుతుంది. కొందరి సమక్షంలో ఇబ్బందులు కలిగిన వెంటనే పక్కకు తప్పుకుంటే భవిష్యత్తు మరింత సింపుల్‌గా ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏ బంధానికైనా పరస్పర గౌరవం ముఖ్యం. కానీ కొందరు అవతలి వారి ఇష్టాయిష్టాలను, భావోద్వేగాలను అస్సలు పట్టించుకోరు. అవతలి వారితో ఇబ్బందికరమైన పనులు చేయించేందుకు ప్రయత్నిస్తుంటారు ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

కొందరితో కాసేపు గడిపితేనే ఒత్తిడి మొదలవుతుంది. ఏదో ఆందోళన ఆవహిస్తుంది. భావోద్వేగపరంగా అలసిపోయినట్టు ఉంటుంది. సౌకర్యంగా ఉన్నామన్న భావన అస్సలు ఉండదు. ఇలాంటి వారికీ వెంటనే గుడ్‌బై చెప్పడం మంచిది.


Feeling Extra Cold: చలి ఎక్కువగా వేస్తోందంటే ఈ సమస్య ఉన్నట్టే

కొందరు అవతలి వారి భావోద్వేగాలకు ఏమాత్రం విలువ ఇవ్వరు. అతిగా ఆలోచిస్తున్నావనో లేదా మరీ సున్నితంగా ఉన్నావనో హేళన చేస్తుంటారు. మానసికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు అండగా ఉండకుండా అవతలి వారి సమస్యలు పెద్దవి కావన్నట్టు చూస్తారు. ఇలాంటి వారి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి.

నిత్యం మనల్ని విమర్శించే వారికి కూడా వీలైనంత దూరంగా ఉండాలి. మెచ్చుకోలుగా ఏనాడు ఒక్క మాట మాట్లాడకపోగా నిత్యం తప్పులు ఎత్తిచూపుతున్నారంటే మనపై అవతలివారికి గౌరవం లేనట్టు భావించాలి. మరో ఆలోచన లేకుండా వీరికి దూరం జరగాలి. అప్పుడే జీవితంలో సంతోషంగా ఉండగలుగుతాం.


Cancer Risk: గుండె జబ్బులు ఉన్న వాళ్లకు క్యాన్సర్ ముప్పు ఎక్కువవుతుందా

గాఢమైన బంధంలో స్వార్థానికి తావు ఉండదు. అవతలి వారి అవసరాలకు కూడా సమప్రాధాన్యం ఉంటుంది. అలా కాకుండా అవసరమైన సందర్భాల్లోనే అవతలి వారికి కాల్, లేదా ఫోన్ పలకరింపులు, మెసేజీలు పెట్టి అక్కడితో ఊరుకుంటున్నారంటే అలాంటి వారు పచ్చిస్వార్థపరులని అర్థం. వీరికి కూడా గుడ్‌బై చెప్పేయడం శ్రేయస్కరం

మీ సామర్థ్యాలను నైపుణ్యాలను శంకిస్తూ ఉండేవారికి వీలైనంత దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్లు మీపై మీకే నమ్మకం కోల్పోయేలా చేస్తారు. జీవితం నిస్సారంగా మారుస్తారు. కాబట్టి, మీపై అపనమ్మకం ప్రదర్శించే వారికి వీలైనంత దూరంగా ఉండండి.

Read Latest and Lifestyle News

Updated Date - Feb 23 , 2025 | 10:48 PM