Viral: 145 ఏళ్ల నాటి టేబుల్ తొలగింపు.. మస్క్ తనయుడి దెబ్బకు ట్రంప్‌లో గుబులు పుట్టిందా..
ABN , Publish Date - Feb 22 , 2025 | 11:19 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కార్యాలయంలోని 145 ఏళ్ల టేబుల్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టి మరో టేబుల్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి మస్క్ తనయుడి అల్లరే కారణమన్న టాక్ వినిపిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ తనయుడు ఎక్స్ (4) షాకిచ్చాడా? శ్వేత సౌధంలో జరిగిన పరిణామం చూస్తూంటే ఇలాంటి సందేహమే కలుగుతోందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల మస్క్‌తో పాటు ఎక్స్ కూడా ఓవల్ ఆఫీసుకు వచ్చిన విషయం తెలిసిందే. డోజ్ శాఖ అధిపతిగా మస్క్‌ను పరిచయం చేసేందుకు ట్రంప్ ఆయనను ఓవల్ ఆఫీసుకు పిలిపించారు. అయితే, మస్క్ తన కుమారడితో పాటు వచ్చారు. ఈ సందర్భంగా బుడ్డోడు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ దెబ్బకు డొనాల్డ్ ట్రంప్ తన డెస్క్‌ను మార్చేశారట.
Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాశ్ పటేల్ ప్రమాణస్వీకారం
అసలేం జరిగిందంటే..
తండ్రితో పాటు వచ్చాక ఎక్స్ నానా అల్లరీ చేశాడు. అది చాలదన్నట్టు ముక్కు రుద్దుకోవడం, నోరు తుడుచుకోవడం.. ఆ తరువాత ట్రంప్ టేబుల్‌ను తాకడం వంటివి చేశాడట. తాను జర్మోఫోబ్ అని ట్రంప్ గతంలోనే పేర్కొన్నారు. వ్యాధికారక సూక్ష్మక్రిములు బారిన పడొచ్చే భయం తనకు ఉందని అన్నారు. దీంతో, మస్క్ కుమారుడు వచ్చి వెళ్లాక ఆ టేబుల్ మార్పించి కొత్త టేబుల్ వేయించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, ట్రంప్ మాత్రం ఈ చర్యకు వెనక గల కారణం మరొకటని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న రిజల్యూట్ టేబుల్ 145 ఏళ్ల నాటిది కాబట్టి దాన్ని మెయింటెనెన్స్ కోసం తాత్కాలికంగా పక్కన పెట్టామని అన్నారు. అది పూర్తయ్యాక మళ్లీ పాత టేబుల్‌నే వినియోగిస్తామని చెప్పుకొచ్చారు.
Visa On Arrival Facility: యూఏఈ వెళదామనుకుంటున్నారా? మీకో అలర్ట్!
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీసు కార్యాలయం ఉన్న విషయం తెలిసిందే. ఇందులోనే 145 ఏళ్ల నాటి టేబుల్ ఉంది. దీనికి రిజట్యూట్ డెస్క్ అని పేరు. అధ్యక్షుడు ఈ కార్యాలయంలోనే తన రోజువారీ అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు.ట్రంప్ తాజాగా ఈ పురాతన టేబుల్‌ను పక్కనపెట్టి దాని స్థానంలో సీ అండ్ ఓ డెస్క్‌ను తెచ్చి పెట్టుకున్నారు.
రిజల్యూట్ డెస్క్‌ను 1880లో అప్పటి బ్రిటన్ రాణి విక్టోరియా అమెరికా అధ్యక్షుడు రూదర్‌ఫోర్డ్ బీ హేయిస్‌కు బహుమతిగా ఇచ్చారు. ఇరు దేశాల మధ్య సహృద్భావం, స్నేహానికి చిహ్నంగా ఈ టేబుల్‌ను తయారు చేయించి బహూకరించారు. బ్రిటన్ నావ హెచ్ ఎమ్ఎస్ రిజల్యూట్ నుంచి సేకరించిన టేకుతో ఈ బల్లను తయారు చేయడంతో దీనికి రిజల్యూట్ డెస్క్ అన్న పేరు వచ్చింది. ఆ తరువాత వచ్చిన అధ్యక్షులు అందరూ ఈ డెస్క్‌ను వినియోగించారు. అయితే, అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ అభ్యర్థన మేరకు ఈ డెస్క్‌ను 1961లో తొలిసారిగా ఓవల్ ఆఫీసులో ఏర్పాటు చేశారు. ఇక సీ అండ్ ఓ డెస్క్‌ను అధ్యక్షుడు జార్జ్ డ డబ్ల్యూ బుష్, తదితరులు వినియోగించారు. ఈ నేపథ్యంలో డెస్క్ మర్పుకు మస్క్ కుమారుడే కారణం అయ్యుండొచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.