Share News

Visa On Arrival Facility: యూఏఈ వెళదామనుకుంటున్నారా? మీకో అలర్ట్!

ABN , Publish Date - Feb 16 , 2025 | 06:08 PM

సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, కెనడా వీసాలు, ఇతర పర్మిట్లు ఉన్న భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు యూఏఈ వెల్లడించింది.

Visa On Arrival Facility: యూఏఈ వెళదామనుకుంటున్నారా? మీకో అలర్ట్!

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు యూఏఈ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు దేశాల వీసాలు, రెసిడెన్స్ పర్మిట్లు లేదా గ్రీన్ కార్డు ఉన్న భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొంది. సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, కెనడా వీసాలు, ఇతర పర్మిట్లు ఉన్న భారతీయులకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించింది.

అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్య దేశలు, యూకే వీసాలు ఇతర పర్మిట్లు ఉన్న భారతీయులను యూఏఈ ఇప్పటికే ముందస్తు వీసా లేకుండానే దేశంలోకి అనుమతిస్తోంది. తాజాగా మరో ఆరు దేశాల వీసాలకు దీన్ని వర్పింపజేసింది (NRI).


Rishi Sunak: తాజ్‌మహల్‌ను సందర్శించిన బ్రిటన్ మాజీ ప్రధాని సునాక్!

యూఏఈ ప్రకటన ప్రకారం, వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కోరే భారతీయులకు పాస్‌పోర్టుతో (కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటయ్యే) పాటు ఆయా దేశాలకు చెందిన వీసా, రెసిడెన్స్ పర్మిట్, లేదా గ్రీన్ కార్డు ఉండాలి. ఇవి ఉన్న వారు. యూఏఈ ఎయిర్‌పోర్టులో దిగాక అక్కడి ఇమిగ్రేషన్ చెక్‌పాయింట్స్‌ వద్ద తగు ఫీజు చెల్లించి అప్పటికప్పుడు వీసా పొందొచ్చు.


Bengali Signboard London Station: లండన్ స్టేషన్‌లో బెంగాలీ భాషలో బోర్డు.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఏంటంటే..

భారతీయ పర్యాటకుల కోసం యూఏఈ మూడు రకాల వీసాలు అందుబాటులో ఉన్నాయి. నాలుగు రోజుల గడువు గల వీసాకు 100 డాలర్లు, 14 రోజుల పొడిగింపునకు, 60 రోజుల పరిమిత గల వీసాకు రూ. 5670ల చొప్పున ఫీజు చెల్లించాలి.

అబుదాబీ, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ వీసా వసతిని విస్తరించినట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. భారతీయులకు సౌకర్యవంతమైన ప్రయాణానుభూతి కల్పించడంతో పాటు యూఏఈలోని ఉద్యోగ, నివాస అవకాశాలను లోతుగా పరిశీలించేందుకు ఈ అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు.

UK Illegal Immigration: అక్రమ వలసదారులకు యూకే కొరడా.. పార్లమెంటులో కొత్త బిల్లు!

Read Latest and NRI News

Updated Date - Feb 16 , 2025 | 07:51 PM