Rishi Sunak: తాజ్‌మహల్‌ను సందర్శించిన బ్రిటన్ మాజీ ప్రధాని సునాక్!
ABN , Publish Date - Feb 15 , 2025 | 09:51 PM
బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్, తన భార్య, పిల్లలు, సుధామూర్తితో కలిసి శనివారం తాజ్‌మహల్‌ను సందర్శించారు.

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్, తన భార్య, పిల్లలు, సుధామూర్తితో కలిసి శనివారం తాజ్‌మహల్‌ను సందర్శించారు. భారీ భద్రత నడుమ కుటుంబసభ్యులతో కలిసి ఆయన తాజ్‌మహల్ వీక్షించేందుకు వచ్చారు. అక్కడ విజిటర్స్ పుస్తకంలో కూడా సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు (NRI).
‘‘ఈ పర్యటన అద్భుతం. తాజా మహాల్ స్థాయి నిర్మాణాలు ప్రపంచంలో అతి కొన్ని మాత్రమే ఉన్నాయి. మా పిల్లలు ఈ పర్యటనను ఎప్పటికీ మర్చిపోరు. ఇక్కడి వారి ఆతిథ్యానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. కుటుంబంలో కలిసి చేస్తున్న ఈ పర్యటనను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని ఆయన అన్నారు. మరోవైపు, రిషి సునాక్ భార్య అక్షతామూర్తి కూడా తాజ్ పర్యటనపై స్పందిస్తూ.. ఇవి ఏళ్ల పాటు గుర్తుండిపోయే జ్ఞాపకాలు అని వ్యాఖ్యానించారు. ఇక బ్రిటన్ మాజీ ప్రధానిని వీక్షించేందుకు జనాలు పెద్ద ఎత్తున వచ్చారు. వారందరికీ సునాక్, ఆయన బార్య చేతులు జోడించి నమస్కారం చేశారు.
ప్రస్తుతం భారత్‌కు వ్యక్తిగత పర్యటనపై వచ్చిన రిషి సునాక్ ఇటీవల భారత్ ఇంగ్లండ్ మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్‌ను కూడా వీక్షించారు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు ఆయన తన మామ, ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తితో పాటు వచ్చారు. అయితే, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి చవ చూసింది. ఇంగ్లండ్ మరోసారి తన సత్తా చాటుతుందని పోస్టు చేసిన ఆయన టీమిండియాకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అంతుకుముందు, టెన్నిస్ బాల్ క్రికెట్ కూడా ఆడారు.
UK Illegal Immigration: అక్రమ వలసదారులకు యూకే కొరడా.. పార్లమెంటులో కొత్త బిల్లు!
అక్టోబర్ 2022 నుంచి జులై 2024 వరకూ రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా సేవలందించిన విషయం తెలిసందే. బిజినెన్ ఫైనాన్స్ రంగంలో అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసిన రిషి సునాక్ ఆ తరువాత రాజకీయంగా అత్యున్నత స్థానానికి ఎదిగారు. రిషి సునాక్ తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికా నుంచి బ్రిటన్‌కు వలసెళ్లారు. రిషి బ్రిటన్‌లోనే జన్మించారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఫుల్ బ్రైట్ స్కాలర్‌గా ఉన్న ఆయన అక్కడ ఎంబీయే చేశారు.