Viral: ఫుల్లుగా తాగాడని యజమానిని ఇంటికి తోలుకెళ్లిన ఆంబోతు! వైరల్ వీడియో
ABN, Publish Date - Jan 05 , 2025 | 10:37 PM
బాగా మద్యం తాగి తూగుతున్న తన యజమానిని ఓ ఆంబోతు జాగ్రత్తగా ఇంటికి తోలుకెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న జనాలు ఇదెలా సాధ్యమంటూ తమ సందేహాలను పంచుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పార్టీల్లో అప్పుడప్పుడూ ఫుల్లుగా మద్యం సేవించి కొందరు ఎటుపోతున్నారో తెలీని స్థితిలో పడిపోతారు. ఇలాంటి వారిని స్నేహితులు, బంధువులో ఇంటికి తీసుకెళతారు. కానీ బ్రెజిల్‌లో మాత్రం ఓ అసాధారణ ఘటన జరిగింది. మద్యం మత్తులో కూరుకుపోయి ఇంటికి దారెటో గుర్తుపట్టలేని స్థితిలో కూరుకుపోయిన ఓ వ్యక్తిని అతడి పెరట్లో ఉండే ఆంబోతు వచ్చి ఇంటికి తోలుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, సదరు వ్యక్తి మద్యం మత్తులో సరిగా నిలబడలేక అటూ ఇటూ తూలుతూ కనిపించాడు. అయితే, అతడి వెనకే ఉన్న ఓ ఆంబోతు అతడిని వెనక నుంచి మెల్లగా తోస్తూ సరైన దారిలో నడిపించింది. అతడు అటూ ఇటూ పడిపోకుండా వీపునకు తల ఆన్చి జాగ్రత్తగా ముందుకు తోసుకుంటూ వెళ్లింది. స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి షాకైపోయారు.
Viral: జీతంలో 70 శాతం పొదుపు చేసి 34 ఏళ్లకే రిటైర్మెంట్! తరువాత ఏం జరిగిందంటే..
ఇదిలా ఉంటే ఈ దృశ్యాలు నెట్టింట కూడా వైరల్‌గా మారాయి. వీడియోకు ఏకంగా 80 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అసలు ఇదెలా సాధ్యమంటూ అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘తను ఇంటికి ఎలా చేరుకున్నది అతడు మరుసటి ఉదయం తెలుసుకుని షాకైపోవడం పక్కా’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ‘‘గేదెలను మనుషులు తోలుకెళ్లడం చూశాం గానీ మనిషిని ఓ ఆంబోతు తోలుకెళ్లడం ఎప్పుడూ చూడలేదు’’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. జంతువులు మనుషుల పట్ల ఎంత విశ్వాసంతో ఉంటాయో చూపించిన ఘటన ఇది అని మరో వ్యక్తి అన్నారు.‘‘ఈ ఆంబోతుకు ఇలా చేయడం బాగా అలవాటనుకుంట. బాగా విసిగిపోయినట్టు ఉంది’’ అని ఓ వ్యక్తి సెటైర్ పేల్చాడు.
Viral: చిరుత వేటకు జింక బలి.. షాక్‌లో మరో 7 జింకల మృత్యువాత
కొందరు మాత్రం ఈ ఉదంతంపై తమకున్న సందేహాలు కూడా వ్యక్తం చేశారు. బార్‌కు వెళ్లిన వ్యక్తి తన వెంట ఆంబోతును తీసుకెళ్లాడా లేక అదే అతడిని ఫాలో అయ్యిందా అని ప్రశ్నించారు. అసలు ఇదంతా ఎలా సాధ్యమన్న క్లారిటీ లేకపోయినప్పటికీ జనాలను మాత్రం ఈ వీడియో విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తోంది. ఫలితంగా కుప్పలు తెప్పలుగా వ్యూస్ వచ్చిపడుతున్నాయి. మరి ఈ ఇంటరెస్టింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఉచిత వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు.. ఉపాధి పోగొట్టుకున్న
Updated Date - Jan 05 , 2025 | 10:37 PM