ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: మోనాలిసా తర్వాత వీరే హాట్ టాపిక్.. సంచనాలకు నిలయంగా మహాకుంభమేళా..

ABN, Publish Date - Jan 29 , 2025 | 11:06 AM

కర్ణాటక రాష్ట్రానికి చెందిన దంపతులు ప్రపంచమంతా తిరిగి చూడాలని కలలు కన్నారు. అయితే ప్రపంచయాత్ర పెద్దమెుత్తంలో ఖర్చుతో కూడుకున్న పని. హోటళ్లు, రెస్టారెంట్లలో ఉంటూ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇంత ఖర్చు భరించలేని ఆ దంపతులు ఓ మంచి ఉపాయం అమలు చేశారు.

Maha Kumbh Mela 2025

ఉత్తర్ ప్రదేశ్: ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ఎన్నో సంచనాలకు నిలయంగా మారుతోంది. కోట్ల మంది ప్రజలు తరలివస్తూ భక్తిశ్రద్ధలతో పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఈ వేడుకలో ఇప్పుడు అనేక మంది ఫేమస్ అయిపోతున్నారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మహాకుంభమేళా ప్రారంభమయ్యాక రుద్రాక్షలు, పూసలు అమ్ముకునే మోనాలిసా అనే పదహారేళ్ల యువతి ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆమె కళ్లు, అందానికి మంత్రముగ్ధులైన యువత సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేశారు. మోనాలిసా అందం దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.


కర్ణాటక రాష్ట్రానికి చెందిన దంపతులు ప్రపంచమంతా తిరిగి చూడాలని కలలు కన్నారు. అయితే ప్రపంచయాత్ర పెద్దమెుత్తంలో ఖర్చుతో కూడుకున్న పని. హోటళ్లు, రెస్టారెంట్లలో ఉంటూ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇంత ఖర్చు భరించలేని ఆ దంపతులు ఓ మంచి ఉపాయం అమలు చేశారు. తమ వద్ద ఉన్న డబ్బులతో టయోటా ఇన్నోవా కారు కొనుగోలు చేసి దాన్నే ఇంటిలా తయారు చేశారు. కారు వెనక భాగాన్ని ఆ దంపతులు వంటగదిగా మార్చేశారు. గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేసి వంట సామగ్రి మెుత్తం అమర్చారు. ఎక్కడికి వెళ్లినా బయట ఆహారాన్ని కొనుగోలు చేయకుండా సొంతంగా వండుకుని తింటున్నారు.


అలాగే కారు పైభాగాన్ని పడకగదిగా మార్చేశారు. రోజు మెుత్తం ప్రయాణం చేస్తూ సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్న తర్వాత అందులో నిద్రిస్తున్నారు. అలాగే బట్టలు, ఇతర సామగ్రి పెట్టుకునేందుకు సైతం కారులోనే పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. నిజానికి ఆ కారును ఓ మెుబైల్ హోమ్‌లా మార్చేశారు. అనంతరం నేపాల్ టూర్ వెళ్తూ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్నారు. దీన్ని చూసిన భక్తులు, సాధారణ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అక్కడే నిలబడిపోయి దాన్ని చూస్తూ సంబరపడిపోతున్నారు. తాము కూడా తమ కారును ఇలాగే మార్చేసి యాత్రలు చేస్తామని చెబుతున్నారు.


ఇక, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానెళ్లు ఆ దంపతుల ఇంటర్వ్యూల కోసం ఎగబడుతూ వారిని తెగ ఫేమస్ చేస్తున్నారు. జాతీయ మీడియా ఆ కారును చూపిస్తూ సదరు దంపతులను ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయడంతో వారి మరింత ఫేమస్ అయిపోయారు. "అవును.. నేను ఇలాంటి ఆవిష్కరణలకు పూర్తిగా ఆకర్షితుడిని అవుతాను. వాళ్లు మహీంద్రా కారును అలా మార్చేసి ఉంటే నేను మరింత ఆకర్షితుడిని అయ్యేవాడిని" అంటూ ఆ వీడియోకు ఆయన క్యాప్షన్ రాసుకొచ్చారు. వారి ప్రయత్నాన్ని మెుచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువలా వస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Updated Date - Jan 29 , 2025 | 11:08 AM