ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: థాయ్‌లాండ్‌కు వెళ్లిన భారతీయులు ఎలాంటి పని చేశారో తెలిస్తే..

ABN, Publish Date - Feb 01 , 2025 | 11:55 PM

థాయ్‌లాండ్ బీచ్‌లో కొందరు భారతీయులు తెల్లవారుజామున బహిరంగ మూత్ర విసర్జనకు దిగిన వైనంపై నెట్టింట తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో విదేశీ టూర్లు వేయడం అత్యంత సాధారణ విషయంగా మారింది. ఇలాంటి టూర్లతో విదేశీ సంస్కృతి, అలవాట్లు, సంప్రదాయాలు, అక్కడి ప్రజలను ప్రత్యక్షంగా చూసే అవకాశం చిక్కుతుంది. ఇలా బోలెడన్నీ మధుర స్మృతులను పోగేసుకుని మళ్లీ సొంత దేశానికి వచ్చే యచ్చు. అయితే, విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడి వారి సంప్రదాయాలను, అలవాట్లను గౌరవించాలి. అక్కడి నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. ఇవేవీ పట్టించుకోకుండా కొందరు థాయ్‌లాండ్ బీచ్‌లో చేసిన పనిపై ప్రస్తుతం సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి (Viral).


Viral: బాత్రూమ్‌ల్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుతున్న ఉద్యోగులు.. చైనా కంపెనీ షాకింగ్ నిర్ణయం

జాతీయ మీడియా కథనాల ప్రకారం, సుమారు ఆరుగురు భారతీయులు జనవరి 16న అక్కటి పట్టాయా బీచ్‌కు వెళ్లారు. అయితే, తెల్లవారుజామున తమను ఎవరూ చూడరని అనుకున్నారో ఏమో కానీ బీచ్‌ వద్దే బహిరంగ మూత్ర విసర్జనకు దిగారు. అక్కడున్న ఓ వ్యక్తి ఈ షాకింగ్ సీన్‌ను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఒక్కసారిగా రచ్చ మొదలైంది.


Keratopigmentation: వామ్మో.. ఇలాంటి సర్జరీలూ ఉన్నాయా? కంటి రంగునే మార్చేసుకుంటున్నారుగా!

స్థానికులతో పాటు నెటిజన్లు అనేక మంది వారి తీరును ఎండగట్టారు. ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించారు. అపరిశుభ్రతను వ్యాపింప చేయడం మంచిది కాదని కొందరు అన్నారు. ఇక స్థానిక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, గస్తీని పెంచాలని సూచించారు. విదేశీ పర్యాటకులకు స్థానిక పద్ధతులు నిబంధనలపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఇలాంటి వారి తీరుతో భారతీయులందరిపైనా ప్రతి కూల ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Feb 01 , 2025 | 11:57 PM