Share News

Keratopigmentation: వామ్మో.. ఇలాంటి సర్జరీలూ ఉన్నాయా? కంటి రంగునే మార్చేసుకుంటున్నారుగా!

ABN , Publish Date - Feb 01 , 2025 | 07:40 PM

కంటి రంగును మార్చే ఆపరేషన్లు చేసే అమెరికన్ డాక్టర్ ఉదంతం ప్రస్తుతం నెట్టింట్లో తెగ ట్రెండవుతోంది. ఇది పూర్తిగా భద్రమైన ప్రక్రియ అని ఆయన చెప్పుకొచ్చారు.

Keratopigmentation: వామ్మో.. ఇలాంటి సర్జరీలూ ఉన్నాయా? కంటి రంగునే మార్చేసుకుంటున్నారుగా!

ఇంటర్నెట్ డెస్క్: అందంగా కనబడాలనే ప్రయత్నంలో అనేక మంది రకరకాల సర్జరీలు చేయించుకుంటారు. అయితే, కంటి రంగును మార్చుకోవాలని సాధారణంగా ఎవరూ కోరుకోరు. అలాంటి కోరిక ఉన్నా ముందడుగు వేయరు. కళ్లు రంగు మార్చుకునే ప్రయత్నంలో ఏదైనా పొరపాటు జరిగితే కంటి చూపు కోల్పోవాల్సి వస్తుందని అనేక మంది జంకుతుంటారు. అయితే, ఇలాంటి భయాలు అవసరమే లేదంటున్నారు ఓ కంటి డాక్టర్. స్వయంగా తాను ఆపరేషన్ ద్వారా కొందరు పేషెంట్ల కంటి రంగును మార్చిన తీరును సోషల్ మీడియాలో పంచుకుంటూ తెగ వైరల్ అవుతున్నారు (Viral).


Professor student wedding: షాకింగ్.. ఈ మహిళా ప్రొఫెసర్ తన స్టూడెంట్‌ను పెళ్లాడారా?

ఇలా సోషల్ మీడియాలో తన కంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న ఆ డాక్టర్ పేరు బ్రియన్ బాక్సర్ వాచ్లర్. ఆయన ఉండేది అమెరికాలో. కంటి రంగు మార్చుకునే ఆపరేషన్లు చాలా సురక్షితమైనవని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ఈ ఆపరేషన్లు కంటికి కాస్మెటిక్ సర్జరీలు లాంటివి. కొందరు ఫేస్ లిఫ్ట్‌ కోసం ఆపరేషన్ చేయించుకుంటారు. మరికొందరు బొటాక్స్ ట్రీట్‌మెంట్‌ను ఆశ్రయిస్తారు. మరి అలాంటప్పుడు కంటి రంగు మార్చుకోవాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. కేవలం 20 నిమిషాల్లో పూర్తయ్యే ఈ ఆపరేషన్‌తో సురక్షితంగా కంటి ఐరిస్ రంగును మార్చొచ్చని వివరించారు. ఆపరేషన్‌కు ముందు కన్ను మొద్దుబారే మందు ఇస్తారని, కాబట్టి ఈ ప్రక్రియలో ఎలాంటి నొప్పి ఉండదని అన్నారు.


Lifestyle: రోజూ ఉదయం 10 గంటల లోపు ఇవన్నీ చేస్తే లైఫ్‌లో ఊహించని మార్పులు!

ఈ సర్జరీని కెరాటో పిగ్మెంటేషన్ అని అంటారట. ఇందులో భాగంగా వ్యక్తుల కార్నియాలో రంగును ప్రవేశపెట్టి కంటిరంగు శాశ్వతంగా మారేలా చేస్తారు. వాస్తవానికి ఇది సాలా సరళమైన ఆపరేషన్ అయినా ఒక కన్ను రంగు మార్చుకునేందుకు ఏకంగా రూ.10 లక్షలు ఖర్చవుతుంది. పేషెంట్లు ఒక రోజులో కోలుకుంటారట. గతంలో లాసిక్ వంటి సర్జరీలు చేయించుకోని వారికి ఈ శస్త్రచికిత్స పూర్తిగా సురక్షితమని సదరు డాక్టర్ చెప్పుకొచ్చారు. మొదట లేజర్ ద్వారా కార్నియాలో సూక్ష్మమైన రంధ్రం చేసి, దాన్లోంచి రంగును కంటిలోకి ప్రవేశపెడతామని చెప్పుకొచ్చారు.

Read Latest and Viral News

Updated Date - Feb 01 , 2025 | 07:40 PM