Lifestyle: రోజూ ఉదయం 10 గంటల లోపు ఇవన్నీ చేస్తే లైఫ్‌లో ఊహించని మార్పులు!
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:38 PM
రోజూ ఉదయం 10 గంటల కల్లా కొన్ని పనులు పూర్తి చేస్తే ఆ రోజంతా ఉత్సాహంగా, కాన్పిడెంట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ తీరు వ్యక్తుల జీవితంలో మేలి మార్పులకు కారణమవుతుందని భరోసా ఇస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఉదయాన్నే టైమ్ ప్రకారం లేవలేక ఇబ్బంది పడుతున్నారా? బద్ధకం వదిలిపెట్టట్లేదా? ఈ సమస్యకు పరిష్కారం కావాలా? ఇలా జీవితంలో మేలి మార్పులు కోసం ఆశించే వారు ఉదయం 10 లోపే కొన్ని పనులు పూర్తి చేస్తే లైఫ్‌లో ఊహించని మార్పులు వస్తాయని లైఫ్ కోచ్‌లు చెబుతున్నారు.
తెల్లవారుజామునే లేస్తే ప్రశాంతమైన వాతావరణంలో ఆ రోజు ప్రణాళికలను ఓసారి సమీక్షించుకోవచ్చు. అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. దీంతో, రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటూ వెళతారు.
పరిశుభ్రతపై కూడా దృష్టి పెట్టాలి. ప్రతి రోజూ స్నానం చేయడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటివి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతాయి (Viral).
ఈ ఏడాది కచ్చితంగా విజయం సాధించాలనుకుంటే ఇలా చేయండి!
నిద్రలేవగానే స్మార్ట్ ఫోన్ చూడాలన్న భావనను అదుపు చేసుకోవాలి. లేచాక కనీసం గంట వరకూ ఫోన్ జోలికి వెళ్లొద్దు. ఈ సమయంలో ఇతర పనులు చేయడం లేదా ప్రణాళికలు రూపొందించుకోవాలి
ఆ రోజు చేయాల్సిన మూడు ముఖ్యమైన పనుల గురించి రాసుకుని అందుకు అనుగూణంగా ప్రణాళికను అమలు చేస్తే లైఫ్‌లో ముందంజ వేస్తారు.
ఇక ఆ రోజు అత్యంత సవాలుగా మారే అవకాశం ఉన్న పనిపై ఉదయాన్నే దృష్టి పెడితే మంచి ప్రయోజనాలు ఉంటాయని కూడా నిపుణులు చెబుతున్నారు. తద్వారా, పనులు వాయిదాలు వేసే చెడు అలవాటు నుంచి సులువుగా బయటపడతారని చెబుతున్నారు.
ఉదయాన్నే ఓ గ్లాసు నీరు తాగడం కూడా మంచి అలవాటని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా రాత్రంతా ఏర్పడ్డ డీహైడ్రేషన్ నుంచి తక్షణం విముక్తి లభిస్తుంది. ఆ తరువాత పౌష్ఠికాహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి.
Professor student wedding: షాకింగ్.. ఈ మహిళా ప్రొఫెసర్ తన స్టూడెంట్‌ను పెళ్లాడారా?
ఇక పనులపై ఫోకస్ పెంచేందుకు ఉదయం పూట కసరత్తులకు మించినది లేదు. దీంతో మెదడుకు రక్త ప్రసరణ మెరుగై రోజంతా మూడ్ బాగుంటుంది.
ఇక మదిలో వచ్చే ఆలోచనలు, ఎంచుకున్న లక్ష్యాలు, సాధించిన పురోగతిని ఓ పుస్తకంలో రాసుకోవడం కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీంతో, వదలని ఆలోచనల నుంచి సాంత్వన దొరకుతుందని చెబుతున్నారు.
ఇక ఉదయం లేచాక ఇంటిని శుభ్ర పరుచుకోవడం, స్ఫూర్తివంతమైన పుస్తకాలు చదవడం కూడా రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.