Professor student wedding: షాకింగ్.. ఈ మహిళా ప్రొఫెసర్ తన స్టూడెంట్‌ను పెళ్లాడారా?
ABN , Publish Date - Jan 30 , 2025 | 09:39 PM
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ ప్రొఫెసర్ స్టూడెంట్‌ను పెళ్లాడినట్టు ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. ఘటనప సంబంధిత యూనివర్సిటీ వీసీ దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లో ఓ మహిళా ప్రొఫెసర్ స్టూడెంట్‌ను పెళ్లాడినట్టున్న వీడియో సంచలనంగా మారింది. జనవరి 14న రికార్డు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.
నాడియాలోని హరింఘాటా టెక్నాలజీ కాలేజ్‌లోని సైకాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ స్టూడెంట్, మహిళ ప్రొఫెసర్ ఇద్దరూ కలిసి వివాహానికి సంబంధించిన వివిధ క్రతువులను చేసినట్టు ఉంది. మహిళకు స్టూడెంట్ సింధూరం దిద్దినట్టు, దండలు మార్చుకున్నట్టు కూడా వీడియోలో రికార్డయ్యాయి. ఈ సందర్భంగా అక్కడున్న కొందరు విద్యార్థులు చప్పట్లు చరస్తూ హర్షం వ్యక్తం చేశారు (Viral).
US Plane Crash: అమెరికా విమాన ప్రమాదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూటి ప్రశ్న వైరల్
జాతీయ మీడియా కథనాల ప్రకారం, వీడియోలోని మహిళా ప్రొఫెసర్ పేరు పాయల్ బెనర్జీ అట. ఆమె అప్లైడ్ సైకాలజీ డిపార్ట్‌మెంట్ మాజీ విభాగాధిపతి అట. తీవ్ర కలకలం సృష్టించిన ఈ వీడియోపై యూనివర్సిటీ వీసీ తపస్ చక్రవర్తి స్పందించారు. ఘటన పూర్వాపరాలు తెలుసుకునేందుకు ఓ ప్యానెల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఈ ఏడాది కచ్చితంగా విజయం సాధించాలనుకుంటే ఇలా చేయండి!
ఈ ఘటనపై ప్రొఫెసర్ బెనర్జీ కూడా స్పందించారు. వీడియోలో కనిపించినది పెళ్లి నాటకం అని చెప్పుకొచ్చారు.అక్కడ ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఈ స్కిట్ నిర్వహించారని అన్నారు. స్కిట్‌లో ప్రధాన పాత్రను ధరించమని విద్యార్థులు తనని కోరడంతో అంగీకరించినట్టు చెప్పారు. ఈ మేరకు ఓ ఫేక్ కార్డు కూడా సిద్ధం చేశారని అన్నారు. ఇతర ఫ్యాకల్టీకి కూడా ఈ విషయం తెలుసని అన్నారు. ఇందులో సీరియస్ విషయం ఏదీ లేదని, విద్యార్థులు రిక్వస్ట్ చేయడంతోనే తాను అంగీకరించానని అన్నారు.
స్టూడెంట్, ప్రొఫెసర్ ఇద్దరూ పరస్పరం భాగస్వాములుగా అంగీకరించినట్టు ఉన్న యూనివర్సిటీ లెటర్ హెడ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ముగ్గురు సాక్షులు కూడా సంతకం చేసినట్టు ఉంది. ఈ నేపథ్యంలో వాస్తవం ఏమిటనేదానిపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది.
పులి మూత్రాన్ని విక్రయిస్తున్న చైనా జంతు ప్రదర్శన శాల! ఎందుకో తెలిస్తే.