Car AC: ఏసీ వేస్తే కారు మైలేజీ తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ABN, Publish Date - Feb 02 , 2025 | 06:42 PM
కారులో వెళుతున్నప్పుడు ఏసీ ఆన్ చేస్తారా? అయితే మేలేజీపై ఏసీ ప్రభావం ఎంత ఉంటుందో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: కారులో ఏసీ అనేది చాలా మందికి ఓ లగ్జరీ. కానీ ఎండాకాలంలో మాత్రం పరిస్థితి తారుమారవుతుంది. ఏసీ లేకుండా కారులో క్షణ కాలం కూడా ప్రయాణించలేము. అయితే, ఏసీ ఆన్ చేస్తే ఇంధన వినియోగం పెరుగుతుందని చాలా మంది భావిస్తారు. దీంతో, ఏసీ ఆఫ్ చేస్తారు.
నిపుణులు చెప్పే దాని ప్రకారం, కారు ఏసీలో రిఫ్రిజ్‌రెంట్ ఉంటుంది. ఇది కారులోని వేడిని గ్రహించి బయటవైపు వదిలిపెడుతుంది.ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఏసీలోని కంప్రెసర్ కీలకం.
కంప్రెసర్ పని చేసేందుకు అదనపు శక్తి అవసరం, దీంతో,కారు ఇంజెన్‌పై భారం పెరుగుతుంది. దీంతో, ఇంధన వినియోగం అధికమై మైలేజీ తగ్గినట్టు అనిపిస్తుంది. దీంతో, అనేక ఇతర అంశాలు దీన్ని ప్రభావితం చేస్తాయని కూడా నిపుణులు చెబుతున్నారు (Viral).
Viral: జపాన్‌లో హృదయవిదారక ఘటన.. జైల్లో ఉండేందుకు నేరాలకు దిగిన 81 ఏళ్ల వృద్ధురాలు!
హై కూలింగ్ సెట్టింగ్ వద్ద ఏసీ ఎక్కువ సేపు ఆన్ లో ఉంటే మైలేజీపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఫుల్ ట్యాంకుపై కారు గరిష్ఠంగా 625 కిలోమీటర్లు ప్రయాణించగలిగితే ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు 500 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలదు.
ఇంజెన్ సామర్థ్యం కూడా ఇంధన వినియోగంపై ప్రభావం చూపుతుంది. చిన్న వాటితో పోలిస్తే భారీ ఇంజెన్లు అధిక శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా ఇలాంటి వాహనాల్లో మేలేజీపై ఏసీ ప్రభావం పెద్దగా కనిపించదు. కానీ 4 సిలిండర్లు ఉన్న సాధారణ ఇంజెన్లున్న కార్లు మాత్రం ఏసీపై అధిక ప్రభావం చూపిస్తాయి.
Uttarpradesh: దారుణం.. మరదలిని హత్య చేయించేందుకు రూ.40 వేలు అప్పు చేసి.. ఆపై..
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. పలు మార్లు ఇంజెన్ ఆన్ ఆఫ్ అయినప్పుడు స్పీడు, కూలింగ్ కొనసాగించేందుకు ఎక్కువ ఇంధనాన్ని వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి తక్కువ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల ఇంజెన్ల విషయంలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక బయట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఏసీ ప్రభావం కారు మేలేజీపై అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక తక్కువ స్పీడులో కారు నడుపుతూ ఏసీ ఆన్ చేసినప్పుడు కూడా మేలేజీ తగ్గుదల ఉంటుంది. హైస్పీడులో కారు వెళుతున్నప్పుడు ఈ ప్రభావం అంతగా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - Feb 02 , 2025 | 06:42 PM