Hikers survives on Toothpaste: కొండల్లో తప్పిపోయి.. 10 రోజుల పాటు టూత్‌పేస్ట్ మాత్రమే తిని..
ABN, Publish Date - Mar 01 , 2025 | 03:28 PM
కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ టీనేజర్ దురదృష్టవశాత్తూ తప్పిపోయాడు. దిక్కుతోచని స్థితిలో పడ్డ అతడు ఏకంగా పది రోజుల పాటు కేవలం టూత్‌పేస్ట్ తిని ప్రాణాలు నిలుపుకున్నాడు. చివరకు కుటుంబసభ్యులు అతడి జాడ కనుక్కుని రక్షించారు.
ఇంటర్నెట్ డెస్క్: కొండల్లో హైకింగ్‌కు వెళ్లి తప్పిపోయిన ఓ టీనేజర్ ఏకంగా 10 రోజుల పాటు కేవలం టూత్ పేస్ట్ తిని ప్రాణాలను నిలుపుకున్నాడు. చైనాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది (Hiker Survives On Toothpaste).
స్థానిక మీడియా కథనాల ప్రకారం, షాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన సోన్ లియాంగ్ హైకింగ్‌కు వెళ్లాలనుకున్నాడు. ఇందు కోసం కిన్‌లింగ్ పర్వత శ్రేణిని ఎంచుకున్నాు. ఇక్కడి పర్వతాలు దాదాపు 2500 మీటర్ల ఎత్తు ఉండటంతో హైకింగ్ ఉత్కంఠభరింతా ఉంటుందని అంచనా వేశాడు (viral).
ముందస్తు ప్రణాళిక ప్రకారం, అతడు ఫిబ్రవరి 8న కిన్‌లింగ్‌లో హైకింగ్ ప్రారంభించారు. మొదటి రెండు రోజులూ అంతా అనుకున్నట్టే సాగినా ఆ తరువాత మాత్రం పరిస్థితులు అనూహ్య మలుపు తీసుకున్నాయి. తను వెంట తెచ్చుకున్న ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో చార్జింగ్ అయిపోవడంతో తాను ఎక్కడ ఉన్నదీ అతడు తెలుసుకోలేకపోయాడు. అది మొదలు ఒక్కో రోజు గడిచే కొద్దీ అతడి కష్టాలు మొదలయ్యాయి.
మరోసారి తండ్రైన ఎలాన్ మస్క్! మొత్తం ఎందరు సంతానం అంటే..
వాతావరణం క్షణానికి ఒక రకంగా మారుతుండటంతో నరకం కనిపించింది. పలుమార్లు కొండలపై నుంచి జారి పడటంతో అతడి కుడి చేయి విరిగిపోయింది. ఆహారం లేక అలమటించాడు. చివరకు నదీ జలాలు, తన వద్ద ఉన్న టూత్‌పేస్ట్ తిని రోజులు డొల్లిచ్చాడు. భారీగా మంచు గాలులు వీస్తుండటంతో పెద్ద రాయిపక్కను తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అక్కడ లభించిన కర్రముక్కలు, ఆకులతో చిన్న బెడ్ ఏర్పాటు చేసుకుని దానిపైనే నిద్రించాడు. ఇలా ఏకంగా పది రోజులు గడిచిపోయాయి. సరైన తండి లేకపోవడంతో అతడి శరీరం బాగా శుష్కించిపోయింది.
ఈలోపు ఆ టీనేజర్ కుటుంబసభ్యులు యువకుడి కోసం వెతకడం ప్రారంభించారు. స్థానికులు, పోలీసుల సాయంతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. మరోవేపు, టీనేజర్‌కు తాను బతుకుతానన్న ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. ఇలాంటి సమయంలో అద్భుతం జరిగింది. అతడి కుటుంబ సభ్యులు చలికాచుకునేందుకు నిప్పు రాజేశారు. ఇలా లేచిన పొగ చూసిన టీనేజర్ పెద్ద పెట్టున కేకలే వేయడంతో కుటుంబసభ్యులు అతడి జాడ కనిపెట్టగలిగారు. దీంతో, కథ సుఖాంతమైంది. అతడి జాడ కనుక్కునేందుకు కుటుంబసభ్యులకు ఏకంగా రూ.9.5 లక్షలు ఖర్చయ్యాయి.
మరిన్ని తాజా వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 01 , 2025 | 03:28 PM