Funny Viral Video: స్టేజ్ మీద డ్యాన్సర్‌పై డబ్బులు విసురుతున్న కొడుకు.. తండ్రి వచ్చి ఏం చేశాడో చూస్తే నవ్వాగదు..
ABN, Publish Date - Mar 08 , 2025 | 07:29 PM
కొన్ని రాష్ట్రాల్లో పెళ్లి లేదా మరే ఇతర ఫంక్షన్ అయినా స్టేజ్ మీద అమ్మాయిల చేత డ్యాన్స్‌లు వేయిస్తుంటారు. అబ్బాయిలు ఆ స్టేజ్ చుట్టూ చేరి సందడి చేస్తుంటారు. కొందరు అబ్బాయిలు మరింత మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఓ డబ్బుల కట్ట పట్టుకుని డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలపై విసురుతుంటారు.
ఉత్తర భారత దేశంలో ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో పెళ్లి లేదా మరే ఇతర ఫంక్షన్ అయినా స్టేజ్ మీద అమ్మాయిల చేత డ్యాన్స్‌లు వేయిస్తుంటారు (Dance Programme). అబ్బాయిలు ఆ స్టేజ్ చుట్టూ చేరి సందడి చేస్తుంటారు. కొందరు అబ్బాయిలు మరింత మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఓ డబ్బుల కట్ట (Money) పట్టుకుని డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలపై విసురుతుంటారు. ఇటీవల ఓ అబ్బాయి కూడా అలాగే చేశాడు. అయితే అతడికి అనుకోని ఆపద ఎదురైంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
satishcomedyvideo09 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక గ్రామంలో వివాహ వేడుక కోసం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఒక అమ్మాయి స్టేజ్ మీద నృత్యం చేస్తోంది. ఓ యువకుడు వేదిక దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిపై డబ్బులు విసరడం ప్రారంభించాడు. ఆ యువకుడి చేతుల్లో నోట్ల కట్టను చూసి, నర్తకి అతడికి దగ్గరగా వెళ్లి డ్యాన్స్ చేస్తోంది. దీంతో ఆ యువకుడు మరింత ఉత్సాహంగా ఆ యువతిపై నోట్లు వెదజల్లడం ప్రారంభించాడు. ఆ కుర్రాడి చేష్టలను గమనించిన తండ్రి వేదిక మీదకు ఎక్కాడు.
మంచి ఉత్సాహంలో నోట్లు వెదజల్లుతున్న కుర్రాడిని అతడి తండ్రి గుండెల మీద తన్నాడు. దీంతో ఆ కుర్రాడు కింద పడిపోయాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ తండ్రి కూడా అతడిని వెంబడించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను పది లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 1.3 లక్షల మంది లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈ వీడియో పూర్తిగా స్క్రిప్టెడ్ అని కొందరు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అయితే.. ఈ కొంగల మధ్యనున్న అమ్మాయి మొహాన్ని కనుక్కోండి..
Pakistan Viral Video: వీళ్లను చూశారా? ఎంత ట్యాలెంటెడ్‌గా ఉన్నారో.. బైక్‌ను రిక్షాలా మార్చేశారు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేేయండి..
Updated Date - Mar 08 , 2025 | 07:29 PM