Pakistan Viral Video: వీళ్లను చూశారా? ఎంత ట్యాలెంటెడ్‌గా ఉన్నారో.. బైక్‌ను రిక్షాలా మార్చేశారు..
ABN , Publish Date - Mar 07 , 2025 | 02:59 PM
జుగాడ్ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వీడియోను చిత్రీకరించింది మన దేశంలో కాదు.. పాకిస్తాన్‌లో. ఆ వీడియో చూస్తే కచ్చితంగా నవ్వుకోవడం మాత్రం ఖాయం.

మన దేశంలో సామాన్య ప్రజలు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. మన దేశంలో కొత్త ఆవిష్కరణలు జరగకపోవచ్చు. కానీ, ఉన్న వాటితోనే వింత వింత పనులు చేసే వాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాంటి జుగాడ్ వీడియోలు (Jugaad Videos) చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వీడియోను చిత్రీకరించింది మన దేశంలో కాదు.. పాకిస్తాన్ (Pakistan)లో. ఆ వీడియో చూస్తే కచ్చితంగా నవ్వుకోవడం మాత్రం ఖాయం.
junaidalijohnny అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొందరు వ్యక్తులు ఓ బైక్ (Bike)ను రిక్షాలా మార్చేశారు. బైక్‌పై మొత్తం 6 మంది ప్రయాణిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఓ బైక్ వెనుక ఓ పొడవాటి చెక్క పలకను అమర్చారు. ఆ చెక్కపై అటు వైపు ముగ్గురు, ఇటు వైపు ముగ్గురు కూర్చున్నారు. రెండు వైపులా బ్యాలెన్స్ కరెక్ట్‌గా కుదరడంతో ఆ చెక్క సరిగ్గా ఉంది. బైక్ మీద కూర్చున్న వ్యక్తి స్టార్ట్ చేసి నడుపుతున్నా ఆ పలక స్థిరంగానే ఉంది. దీంతో ఆ బైక్ మీద ఏకంగా ఆరుగురు వ్యక్తులు హాయిగా కూర్చున్నారు. ఆ వెరైటీ ప్రయత్నాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3 కోట్ల మందికి పైగా వీక్షించారు. అలాగే ఆ వీడియోకు 5 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఇక తాను ఆటో కొననని, ఈ ఐడియాతోనే డబ్బు సంపాదిస్తానని వ్యక్తి కామెంట్ చేశాడు. ఎదురుగా ఏదైనా వాహనం వస్తే ఏం చేయాలని మరో వ్యక్తి ప్రశ్నించాడు. అద్భుతమైన టెక్నాలజీ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: ఈ రాళ్ల మధ్యలో జింక ఎక్కడుంది.. ఇది కనిపెడితే మీ కళ్లు సూపర్ షార్ప్..
Business Plan: ఇండియాలో ఇప్పుడిదే డ్రీమ్ బిజినెస్.. నెలకు ఎంత సంపాదనో తెలుసా?
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేేయండి..