ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumbh Mela - Non Veg Food: కుంభమేళాలో జంట నీచత్వం.. ఆగ్రహంతో ఊగిపోయిన నాగ సాధువు ఊహించని విధంగా..

ABN, Publish Date - Feb 06 , 2025 | 04:19 PM

కుంభమేళాకు వచ్చి మాంసాహారం వండుకున్న ఓ కుటుంబాన్ని చూసి కోపంతో ఊగిపోయిన నాగ సాధువు వారిని చావచితక కొట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: మాహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్ల సంఖ్యలో హిందువులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు. 144 ఏళ్లకు ఒక మారు మాత్రమే వచ్చే ఈ కుంభమేళా సందర్భంగా అక్కడి త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానమాచరించి ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తున్నారు. అయితే, ఈ సంరంభం విశిష్టతను, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరిచి కొందరు చేస్తున్న పనులు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇక తాజా ఉదంతంలో ఓ జంట చేసిన పాడు పని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన నాగ సాధువు వారిని చావచితకత కొట్టారు (Viral).

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆ కుటుంబం టెంట్‌లో మాంసాహారం వండుకుని తింటోంది. ఇది గమనించిన నాగ సాధువుతో పాటు మరికొందరు వారిపై దాడికి దిగారు. గుడారాన్ని విసిరి పారేసిన నాగు సాధువులో లోపలున్న వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. కుంభమేళా వంటి పవత్ర కార్యక్రమానికి వచ్చి మాంసాహారం తింటావా అంటూ నానా యాగీ చేశారు. వారి గుడారం పక్కన మాంసాహారం ఉన్న గిన్నెలు కూడా స్పష్టంగా కనిపించాయి.


Viral: మరో 3 నిమిషాలు ఆగితే మరో రైలు వస్తుందని కద తల్లీ! ఎందుకింత తొందర!?

ఇక వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుంభమేళాలో మాంసాహారం వండటంపై అనేక మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఈ కార్యక్రమంలో ఈ అపవిత్రపు పనులేంటని నిలదీశారు. కుంభమేళాలో మాంసాహారాన్ని యూపీ ప్రభుత్వం నిషేధించిందని గుర్తు చేశారు. మాంసాహారం విక్రయం, భుజించడంపై నిషేధం ఉందని పేర్కొన్నారు. మతపరమైన వేడుకల్లో స్థానిక సంప్రదాయాలను గౌరవించాలని హితవు పలికారు. కొందరు మాత్రం నాగ సాధువు దాడిని ఖండించారు. వేరొకరిపై చేయి చేసుకునే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఆ కుటుంబంపై దాడి చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.


వామ్మో.. ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న మస్క్.. రోజుకు ఎన్ని గంటలు పని చేస్తున్నారో తెలిస్తే..

జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే మహా కుంభమేళాకు అత్యంత ప్రాముఖ్యత ఉండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళుతున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయితే, మౌని అమావాస్య నాడు త్రివేణి సంగమం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 30 మంది మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Read Latest and Viral News

Updated Date - Feb 06 , 2025 | 05:20 PM