Share News

వామ్మో.. ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న మస్క్.. రోజుకు ఎన్ని గంటలు పని చేస్తున్నారో తెలిస్తే..

ABN , Publish Date - Feb 04 , 2025 | 05:41 PM

తన ఆధ్వర్యంలోని డోజ్ శాఖ ఉద్యోగులు వారానికి 120 గంటలు పనిచేస్తున్నారంటూ మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వామ్మో.. ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న మస్క్.. రోజుకు ఎన్ని గంటలు పని చేస్తున్నారో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: వారానికి 70 గంటలు పని చేయాలన్న ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సూచన దేశంలో ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో తెలిసిందే. అయితే, మస్క్ తన ఉద్యోగులతో ఏకంగా వారానికి 120 గంటలు పని చేయిస్తున్నారన్న వార్త మరింత సంచలనం కలిగిస్తోంది. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. తన ఆధ్వర్యంలోని డోజ్ శాఖలో ఉద్యోగులు వారానికి 120 గంటలు పని చేస్తున్నారని అన్నారు. తద్వారా ఇత ప్రభుత్వ శాఖల కంటే ఉత్పాదకతలో ముందున్నారని చెప్పుకొచ్చారు (Elon Musk).


ChatGPT : అవును.. ఛాట్ జీపీటీ ఈ పొలిటికల్ పార్టీకి అనుకూలంగా ఉంది.. మస్క్..

‘‘డోజ్ శాఖలోని వారు వారానికి 120 గంటల చొప్పున పని చేస్తున్నారు. మిగతా శాఖల్లోని వారు మాత్రం వారానికి 40 గంటలే పనికి కేటాయిస్తున్నారు’’ అని మస్క్ గర్వంగా ప్రకటించుకున్నారు. కొన్నేళ్లుగా ప్రజాధనం వృధా అవుతున్న తీరుకు ఎలాన్ సారథ్యంలోని డోజ్ శాఖ ఎట్టకేలకు బ్రేకులు వేస్తోందంటూ ఓ వ్యక్తి చేసిన కామెంట్‌కు మస్క్ ఈ మేరకు స్పందించారు. తమ శాఖ అధికంగా పని చేస్తున్నందుకు మిగతా వారు వెనకబడుతున్నారని కూడా చెప్పుకొచ్చారు.

Sunitha Williams : 7 నెలలుగా నడవలేదు.. కూర్చోలేదు.. పడుకోలేదు.. సునీతా విలియమ్స్..


దీనిపై సహజంగానే నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. భిన్నాభిప్రాయాలు, మస్క్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. ‘‘ఏంటీ? వారానికి 120 గంటలా. అతిగా పని చేస్తే తప్పులు అధికమవుతాయి. డోజ్ శాఖ తన గొయ్యిని తానే తవ్వుకుంటోంది’’ అని ఓ వ్యక్తి హెచ్చరించారు. ‘‘వారానికి 120 గంటలంటే రోజుకు (వారాంతాల్లో కూడా) 17 గంటల 8 నిమిషాల పాటు పని చేస్తున్నట్టు. ఇది నిజంగా మూర్ఖత్వమే’’ అని మరో వ్యక్తి అన్నారు. మీరు దారుణమైన బాస్‌‌లా ఉన్నారుగా’’ అని మరో వ్యక్తి కామెంట్ చేశారు.

‘‘నేనూ గతంలో ప్రభుత్వంలో పని చేశా. అక్కడి నిబంనల ప్రకారం, అనధికారికంగా ఎక్కువ సేపు పని చేయడం చట్టవ్యతిరేకం. ఇలా చేస్తే ప్రభుత్వం ఆ మేరకు పారితోషికం ఇవ్వాలి. బానిసత్వం చట్టవ్యతిరేకం కదా. మరి డోజ్ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఎలా ఎక్కువ సమయం పని చేస్తున్నారు? అది పలు షిఫ్టుల్లో’’ అని ఇంకొకరు ప్రశ్నించారు. కొందరు మాత్రం డోజ్ శాఖ కష్టపడుతున్న తీరును ప్రశంసించారు. ‘‘ట్రిలియనీర్ కావాలన్న తన లక్ష్యాన్ని చేరుకునేందుకు మస్క్ అబద్దాలాడుతున్నారు. టెక్ రంగంలో పని చేయడమంటే వెట్టి చాకిరీనే. మీరు చచ్చేదాకా పని చేస్తేనే మస్క్ తన లక్ష్యాన్ని చేరుకోలేరు అని మరో వ్యక్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Latest and International News

Updated Date - Feb 04 , 2025 | 05:43 PM