Viral: బాత్రూమ్‌ల్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుతున్న ఉద్యోగులు.. చైనా కంపెనీ షాకింగ్ నిర్ణయం
ABN, Publish Date - Feb 01 , 2025 | 08:17 PM
టాయిలెట్లల్లో ఎక్కువ సేపు ఉంటూ సమయం వృథా చేసే ఉద్యోగుల ఫొటోలు తీసి బాత్రూమ్‌లపై అంటించిన ఓ చైనా సంస్థ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది ఉద్యోగులు ఆఫీసుల్లో సమయాన్ని వృథా చేస్తుంటారు. కొందరు తమ సీట్లల్లో కూర్చునే సెల్‌ఫోన్ చూస్తూ టైం వేస్టు చేస్తుంటే మరికొందరు బాత్‌రూమ్‌లల్లోకి వెళ్లి అక్కడ పొగతాగుతూ లేదా మొబైల్ ఫోన్ చూస్తూ టైం వేస్టు చేస్తుంటారు. ఇలాంటి ఉద్యోగులతో విసిగిపోయిన ఓ చైనా సంస్థ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నం బెడిసికొట్టడంతో చివరకు తీవ్ర విమర్శల పాలైంది (Viral).
బాత్రూమ్ బ్రేక్ పేరిట గంటలకు గంటలు వృథా చేస్తున్న ఉద్యోగులపై సదరు సంస్థ ఊహంచని ప్రతీకారినికి దిగింది. బాత్రూమ్‌లో కూర్చుని ఎంతకీ బయటకు రాని వారిని సీక్రెట్‌గా తలుపు పై నుంచి రికార్డు చేయించి ఆ ఫొటోలను బాత్రూమ్ తలుపులపై అందరికీ కనిపించేలా అంటించి పరువు తీసే ప్రయత్నం చేసింది.
Keratopigmentation: వామ్మో.. ఇలాంటి సర్జరీలూ ఉన్నాయా? కంటి రంగునే మార్చేసుకుంటున్నారుగా!
ఇది తప్పుకాదా అని కొందరు ప్రశ్నిస్తే ఇలా చేయడం తప్పదని కంపెనీ యాజమాన్యం చెప్పుకొచ్చింది. కొందరు బాత్రూమ్‌లోకి వెళ్లాక పొగ తాగుతుంటారు. మరికొందరు వీడియో గేమ్స్ ఆడుతూ సమయాన్ని వ్యర్థం చేస్తారు. ఇతరులు తలుపు కొట్టినా బయటకు రాకుండా ఇబ్బందికి గురి చేస్తుంటారు. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పేందుకే ఇలా చేయాల్సొచ్చిందని సంస్థ పేర్కొంది. ఈ తీరుపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తడంతో చివరకు వెనక్కుతగ్గింది. ఇలా చేసుండాల్సింది కాదంటూ పొటోలను తొలగించింది.
Most Used Word by FM: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో అత్యధిక సార్లు వినిపించిన పదం ఇదే!
ఇదిలా ఉంటే.. సంస్థ తీరుపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చర్య గర్హనీయమని అనేక మంది కామెంట్ చేశారు. ఇది ఉద్యోగుల గోప్యతకు భంగం కలిగించడమేనని తేల్చి చెప్పారు. బాధితులు కంపెనీపై కోర్టులో కేసేస్తే భారీగా పరిహారం పొందొచ్చని సలహా కూడా ఇచ్చారు. కంపెనీ సమయం వృథా చేయడం తప్పే అయినా ఇలాంటి శిక్షలు మాత్రం అస్సలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.
Updated Date - Feb 01 , 2025 | 08:17 PM