Viral Funny Video: సైకిల్ మీద వెళ్తున్న అమ్మాయితో అబ్బాయి రొమాన్స్.. మరో అమ్మాయికి ఎంత కోపం వచ్చిందంటే..
ABN, Publish Date - Jan 29 , 2025 | 03:39 PM
కొందరు సోషల్ మీడియా జనాలను ఆకట్టుకునేందుకే కొన్ని ఫన్నీ వీడియోలను రూపొందిస్తున్నారు. అవి లక్షల కొద్దీ వ్యూస్, వేల కొద్దీ లైక్స్ దక్కించుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనాలు విపరీతంగా నవ్వుకుంటున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటూ, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కొందరు సోషల్ మీడియా జనాలను ఆకట్టుకునేందుకే కొన్ని ఫన్నీ వీడియోలను (Funny Videos) రూపొందిస్తున్నారు. అవి లక్షల కొద్దీ వ్యూస్, వేల కొద్దీ లైక్స్ దక్కించుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనాలు విపరీతంగా నవ్వుకుంటున్నారు (Viral Video).
@TheDogeVampire అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఇద్దరు అమ్మాయిలు ఖాళీగా ఉన్న రోడ్డు మీద సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఓ కుర్రాడు స్కేటింగ్ చేసుకుంటూ వారిని అనుసరించాడు. సైకిల్ వెనుక కూర్చున్న అమ్మాయికి చేయి అందించి ఆమెతో సరదా విన్యాసాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. వాళ్లిద్దరూ నవ్వకుంటూ పరిసరాలను మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. వారిద్దరి తీరు సైకిల్ తొక్కుతున్న అమ్మాయికి చిరాకు తెప్పించింది. సైకిల్ వెళ్తుండగానే హ్యాండిల్ వదిలేసి దిగిపోయింది. దీంతో ఆ సైకిల్ రోడ్డు పక్కన ఉన్న తప్పుల్లోకి దూసుకెళ్లిపోయింది.
సైకిల్‌తో పాటు వెనుక కూర్చున్న అమ్మాయి కూడా తుప్పల్లోకి వెళ్లిపోయి పడిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 8 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. దాదాపు పది వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ అమ్మాయి సరైన పని చేసింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: డోంట్ టచ్ మీ.. ఆహారం అందించి కోతిని ముట్టుకున్న యువతికి షాక్.. ఏం జరిగిందో చూడండి..
Optical Illusion: మీ కంటి పవర్ రేంజ్ ఎంత?.. ఈ ఫొటోలో చేప ఎక్కడుందో కనిపెట్టండి..
Strange Job: ఓర్నీ.. ఇలా కూడా కోట్లు సంపాదించవచ్చా? ఈ వ్యక్తి జాబ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 29 , 2025 | 03:39 PM