ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bill Gates: స్కూలు రోజుల్లో టీచర్‌కు షాకిచ్చిన బిల్ గేట్స్! కబేళా నుంచి ఏకంగా..

ABN, Publish Date - Jan 23 , 2025 | 11:36 PM

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తన చిన్న నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఓ వీడియో చేశారు. స్కూల్ రోజుల్లో తను చేసిన పని సాటి విద్యార్థులకు ఎలా సర్‌ప్రైజ్ చేసిందీ చెప్పుకొచ్చారు. ఇలాంటి అనేక ఘటనతో ఓ పుస్తకాన్ని ఆయన వెలువరించనున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన చిన్ననాటి ఆసక్తిక విషయాలను ఓ ఇన్‌స్టా వీడియోలో(Viral) పంచుకున్నారు. స్కూల్ రోజుల్లో తన టీచర్‌ను, సహ విద్యార్థులను నాలుగో తరగతిలోనే ఎలా సర్‌ప్రైజ్ చేసిందీ ఆయన చెప్పుకొచ్చారు (Bill Gates).

‘‘అప్పట్లో నేను నాలుగో తరగతి చదువుతున్నా. టీచర్ ఆ రోజు ఓ అసైన్‌మెంట్ ఇచ్చింది. ఏదైనా అంశాన్ని క్లా్స్‌రూంలో ప్రదర్శిస్తూ వివరించాలని కోరింది. నేను ఈ విషయాన్ని మా నాన్నతో చెప్పా. ఆయన నన్ను కబేళాకు తీసుకెళ్లారు. అక్కడ మేము ఆవు ఊపిరితిత్తులను తీసుకొని వచ్చాము. మరుసటి రోజు నేను దాన్ని పేపర్‌లో చుట్టి స్కూలుకు తీసుకెళ్లా’’


IndiGo Flight Preponed: ఇండిగో విమానం 15 నిమిషాలు ముందుగా బయలుదేరడంతో ప్రయాణికుడికి భారీ షాక్!

‘‘ఆ తరువాత దాన్ని టేబుల్ మీద పెట్టా. పేపర్ తీయగానే ఊపిరితిత్తుల ను చూసి టీచర్‌తో పాటు సహ విద్యార్థులు షాకైపోయారు. కొందరు ఆ జుగుప్సాకర దృశ్యాన్ని చూడలేమన్నటు ముఖం పెట్టారు. నేను ఉత్త చేతులతోనే ఊపిరితిత్తులను తాకి దాని పనితీరు వివరించారు. ఓకే కానీ ముందు దాన్ని బయటకు తీసుకెళ్లు అని టీచర్ అన్నారు’’ అని తన చిన్నాటి గుర్తులను బిల్ గేట్స్ తాజా వీడియోలో నెమరేసుకున్నారు.


Aravind Srinivas Nandan Nilekani: భారత్‌కు ఆ ఏఐ మోడళ్లు అవసరం లేదన్న నీలేకని.. ఆ భావన తప్పన్న పర్‌ప్లెక్సిటీ సీఈఓ!

కాగా, తాజా వీడియోలో ఆవు ఊపిరితిత్తులను చూపించిన బిల్ గేట్స్ దాని పనితీరును వివరించారు. అప్పట్లో ఇలాంటి ప్రదర్శన ఇస్తే తన స్కూల్ ఫ్రెండ్స్‌కు మూర్ఛ వచ్చినంత పనైందని అన్నారు. ఏదైనా ఆసక్తికర అంశాన్ని వివరించమని చెబితే తాను అలా చేశానని చెప్పుకొచ్చారు. కాగా ఇలాంటి పలు అసక్తికర విషయాలతో బిల్ గేట్స్ ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఫిబ్రవరిలో ఇది విడుదల కానుంది. ఇందులో తన చిన్న నాటి రోజులతో పాటు మైక్రోసాఫ్ట్ తొలి రోజుల గురించి కూడా వివరించనున్నారు. 1975లో బిల్ గేట్స్, పాల్ అలెన్ అనే వ్యక్తితో కలిసి మైక్రోసాఫ్ట్ స్థాపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ తన సంప్రదాయ వ్యాపారాల నుంచి క్లౌడ్ ఆధారిత, ఏఐ ఆధారిత సర్వీసుల వైపు మళ్లింది. పలు ఉపయోగకర ఉత్పత్తులతో టెక్ రంగంలో మేటి సంస్థగా వెలుగొందుతోంది.

Geyser on for 4 Months: బ్యాచిలర్స్ మతిమరుపుతో చిక్కులు! బాత్రూమ్‌లో గీజర్ ఆఫ్ చేయడం మర్చిపోతే..

Read Latest and Viral News

Updated Date - Jan 23 , 2025 | 11:38 PM