ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Geyser on for 4 Months: బ్యాచిలర్స్ మతిమరుపుతో చిక్కులు! బాత్రూమ్‌లో గీజర్ ఆఫ్ చేయడం మర్చిపోతే..

ABN, Publish Date - Jan 23 , 2025 | 07:50 PM

ఓ యువకుడు ఊరెళ్లేటప్పుడు తన ఇంట్లోని గీజర్‌ను ఆఫ్ చేయడం మర్చిపోయాడు. నాలుగు నెలల తరువాత తిరిగొచ్చిన అతడు గీజర్ ఆన్‌లోనే ఉన్న విషయాన్ని గుర్తించి అవాక్కయాడు.

ఇంటర్నెట్ డెస్క్: ఇల్లు తాళం పెట్టి బయటకెళ్లేటప్పుడు ఒక్కోసారి ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ చేయడం మర్చిపోతుంటాం. ఇది అందరికీ జరిగేదే. కానీ, పెళ్లి కానీ, బరువుబాధ్యతలు తెలీని యువత కొందరు మరిన్ని అసాధారణ పొరపాట్లు చేస్తుంటారు. చివరకు చిక్కుల్లో పడుతుంటారు. అలాంటి యువ కిశోరాల గురించి ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్నాం. ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటున్న ఓ వ్యక్తి ఊరెళ్లే ముందు ఇంట్లోని గీజర్ కట్టేయకుండా వెళ్లిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా వారు నెట్టింట పంచుకోవడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది (Viral).

ఆదిత్యదాస్ అనే నెటిజన్ ఈ విషయాన్ని నెట్టింట పంచుకున్నాడు. తనతో పాటు ఫ్లాట్‌లో ఉంటున్న ఓ వ్యక్తి గీజర్ ఆఫ్ చేయకుండానే ఊరెళ్లిపోయాడని చెప్పాడు. తాను ఊరుకు వెళ్లడంతో నాలుగు నెలల పాటు గీజర్ ఆన్‌లోనే ఉందని అన్నారు. ఈ పోస్టు నెట్టింట కాలు పెట్టగానే తెగ వైరల్ అయిపోయింది. జనాలు రకరకాల కామెంట్స్, సందేహాలు, సలహాలతో హోరెత్తించారు (Leave Geyser on for 4 Months).


Air Hostess to pig farmer: ఎయిర్ హోస్టస్ జాబ్‌కు గుడ్ బై చెప్పి పందుల పెంపకం! 2 నెలలు తిరిగే సరికల్లా..

నాలుగు నెలల పాటు ఏకధాటిగా గీజర్ ఆన్‌లో ఉంచినందుకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందని అనేక మంది ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చి ఆదిత్య తనకు ఇంకా కరెంటు బిల్లు అందలేదని అన్నారు. ‘గత అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ నాకు బిల్లు రాలేదు. కానీ ఈ బిల్లు చెల్లించేందుకు కచ్చితంగా లోన్ తీసుకోక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.

దీనిపై అనేక మంది పలు రకాల కామెంట్స్ చేశారు. ‘‘ఇండియాలో ఉన్న వాళ్లకు బయటకు వెళ్లేటప్పుడు గీజర్ ఆఫ్ చేసి వెళ్లడం అలవాటు గానీ పాశ్చాత్య దేశాల్లో ఇలా ఉండదు. మేము వాటిని నిరంతరం ఆన్‌లోనే ఉంచుతాము. ఏళ్ల తరబడి ఆన్‌లో ఉన్నా ఏ సమస్యా ఉండదు’’ అని చెప్పుకొచ్చారు.

Viral: మిలిటరీ కత్తి చేతబూని స్టెప్పులేసిన అమెరికా అధ్యక్షుడు.. ట్రంప్ సంబరం చూసి సైనికాధికారులకు టెన్షన్!


ఈ కామెంట్‌పై కొందరు మరింత వివరణ ఇచ్చారు. ఆధునిక గీజర్లలో ఉష్ణోగ్రత సెన్సర్లు ఉంటాయని, నీరు కావాల్సినంత వేడిగా మారగానే వాటంతట అవే ఆఫ్ అవుతాయని చెప్పారు. పాత వాటిల్లో ఇలాంటి సెన్సర్లు ఉండవని కొందరు అన్నారు. అలాంటప్పుడు హీటింగ్ కాయిల్ అసాధారణంగా వేడెక్కి పాడయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

గీజర్లలోని థెర్మోస్టాట్ పాడయితే ప్రమాదమని కొందరు హెచ్చరించారు. ఇలాంటి సందర్భాల్లో హీటింగ్ కాయిల్స్ పాడయ్యి రిపేర్ చేయాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఏకంగా కొత్త గీజర్ కొనుక్కోవాల్సి రావచ్చని అన్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Read Latest and Viral News

Updated Date - Jan 23 , 2025 | 07:50 PM