Viral: విడాకుల తీసుకున్న వెంటనే తోడు కోసం మహిళ ప్రయత్నం! జీవితం తలకిందులు
ABN, Publish Date - Feb 19 , 2025 | 07:05 PM
భర్త నుంచి విడాకులు తీసుకున్నాక మళ్లీ డేటింగ్ మొదలెట్టిన మహిళ ఆన్‌లైన్ స్కామ్‌ల బారిన పడి తన డబ్బంతా పోగొట్టుకుని వీధి పాలైంది. ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఈ ఉదంత ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: 33 ఏళ్ల వైవాహిక జీవితానికి అకస్మాత్తుగా ముగింపు పడింది. ఇక విడాకుల తీసుకున్న వెంటనే మాజీ భర్త మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో, తనూ మరో తోడు కోసం ప్రయత్నించింది. ఆన్‌లైన్‌లో ప్రేమ కోసం వెతికింది. చివరకు ఇదే ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసింది. జీవితమంతా కష్టించి కూడబెట్టుకున్న సొమ్ము మొత్తం మోసగాళ్ల పాలు కావడంతో చేతిలో చిల్లిగవ్వ లేక మహిళ వీధి పాలైంది. ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే (Viral)..
జీవితం మొత్తం ఆన్‌లైన్‌మయంగా మారిన నేటి జమానాలో ప్రేమల కోసం కూడా ఆన్‌లైన్‌లోనే అన్వేషించడం పరిపాటిగా మారింది. ఈ తీరు కొందరికి కలిసి వస్తున్నా మరికొందరి జీవితాల్సి మాత్రం తలకిందులు చేస్తోంది. పెర్త్ నగరానికి చెందిన ఎన్నెట్ ఫోర్డ్ లైఫ్‌లో సరిగ్గా ఇదే జరిగింది. ఆన్‌లైన్‌లో డేటింగ్‌కు ప్రయత్నించి ఏకంగా రూ.4.3 కోట్లు నష్టబోయింది.
Anand Mahindra: టెస్లా ఎంట్రీతో పెరగనున్న పోటీపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్
ఎన్నెట్ ఫోర్డ్ 2018లో తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ వెంటనే మాజీ భర్త మరో భాగస్వామితో కొత్త జీవితం ప్రారంభించాడు. ఒంటరితనం భరించలేక ఎన్నెట్ కూడా తోడు కోసం ఆన్‌లైన్‌లో అన్వేషించింది. ఓ డేటింగ్ యాప్ ద్వారా ఆమెకు విలియమ్ అనే ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను మేలేషియాలో పనిచేస్తున్నానని చెప్పుకున్న విలియం అత్యంత చాకచక్యంగా నెలల వ్యవధిలోనే ఆమె విశ్వాసం పొందాడు. ఆ తరువాత డబ్బు దోచుకోవడం మొదలెట్టాడు. పని ప్రదేశంలో ఎవరో తన వ్యాలెట్, క్రెడిట్ కార్డులు కొట్టేశారని ఆమెకు చెప్పాడు. నిజమని నమ్మిన మహిళ అతడు కోరిన మొత్తాన్ని బదిలీ చేసింది. ఆ తరువాత తాను ఆసుపత్రిలో ఉన్నానని ఓసారి, కార్మికులకు జీతాలు ఇవ్వాలని మరోసారి భారీగా డబ్బు తీసుకున్నాడు. ఇలా రకరకాల కారణాలతో మొత్తం రూ.1.6 కోట్లు తీసుకున్నాడు. అప్పటికి గానీ ఆమెకు తాను మోసపోయాన్న విషయం అర్థం కాలేదు. దీంతో, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Viral: బ్రేక్‌ఫాస్ట్‌లో చిన్న మార్పుతో రూ.83 లక్షలు పొదుపు చేసిన యువతి
ఈలోపు నెల్సన్ అనే మరో వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. అతడి మాయమాటలకు ఆమె మునుపటి గుణపాఠం మొత్తం మర్చిపోయింది. తోడు కోసం తపనలో మళ్లీ అతడి మోసానికి బలైపోయింది. ఈసారి నిందితుడు కొత్త ట్రిక్ ప్లే చేశాడు. తన పంపించే డబ్బును బిట్‌కాయిన్ ఏటీఎం ద్వారా మరో వ్యక్తికి పంపించాలని చెప్పాడు. మనసు కీడు శంకిస్తు్న్నా తనకు తాను నచ్చ చెప్పుకుని అతడు చెప్పినట్టే చేసింది. అది మొదలు ఆమెకు తెలీకుండానే తన అకౌంట్లోంచి మరో రూ.1.6 కోట్లు అదృశ్యమైయ్యాయి. చేతిలో చిల్లి గవ్వ లేని పరస్థితి వచ్చింది. ఉన్నంతా పోగుటున్న ఆమె మరొకిరికి ఇలా జరగకుండా తన ఉదంతాన్ని నెట్టింట పంచుకుంది. ప్రేమ పేరిట టోపీ పెట్టే మోసగాళ్లు ఆన్‌లైన్‌లో ఎందరో ఉన్నారని, వారి పాల పడకుండా జాగ్రత్త పడాలని తోటి ఆస్ట్రేలియన్లను ఆమె హెచ్చరించింది.
Updated Date - Feb 19 , 2025 | 07:05 PM