ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Planetary Parade: నేటి సాయంత్రం అంతరిక్షంలో అద్భుతం.. ఒకే వరుసలో 7 గ్రహాలు

ABN, Publish Date - Feb 28 , 2025 | 09:00 AM

నేటి సాయంత్రం ఏకంగా 7 గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని అస్సలు మిస్ కావొద్దని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్షం ఓ అద్భుతం.. మనిషికి తెలియని ఎన్నో రహస్యాలను ఈ విశ్వం తనలో ఇముడ్చుకుంది. రాకెట్ల సాయంతో ఎన్ని యాత్రలు చేసినా ఇప్పటికీ మనిషి మేధస్సుకు అందని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. ఇదంతా ఒకెత్తైతే ఆకాశాంలో మినుకు మినుకుమనే నక్షత్రాల అందాలు మరో అద్భుతం. ఈ దృశ్యాలను చూసేందుకు ఎందరో ఔత్సాహికులు ఏకంగా టెలిస్కోపులను కొనుక్కుకుని మరీ అంతరిక్ష వీక్షణం చేస్తుంటారు (Seven planets in a row planetary parade). ఇలాంటి వారిని అబ్బుర పరిచే మరో అద్భుత దృశ్యం నేటి సాయంత్రం సాక్షాత్కారం కానుంది. దీన్ని అస్సలు మిస్ కావొద్దని నిపుణులు చెబుతున్నారు (Viral).

ఈ సాయంత్రం సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలు ఒకే వరుసలో రానున్నాయి. మార్స్ (కుజుడు), జూపిటర్ (గురుడు), యూరేనస్, వీనస్ (శుక్రుడు), నెప్ట్యూన్, మెర్క్యూరీ (బుధుడు), శాటర్న్ (శని) గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. మళ్లీ 2040లో కానీ ఇలాంటి అద్భుత దృశ్యం సాక్షాత్కారం కాదట. అందుకే నేటి సాయంత్రాన్ని మిస్ కావద్దని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.


Teacher Rant on Bihar: బీహార్‌‌లో పోస్టింగ్.. కేంద్రీయ విద్యాలయ టీచర్‌ తిట్ల దండకం

సౌర కుటుంబంలో గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. కానీ వాటి కక్ష్య వేగం భిన్నంగా ఉంటాయి. ఎప్పుడో అరుదుగా మాత్రమే అవన్నీ ఒకే వరుసలో ఉన్నట్టు కనిపిస్తాయి. ఈ అరుదైన సందర్భాన్ని ఖగోళశాస్త్ర పరిభాషలో ప్లానెటరీ పరేడ్ అని అంటారు. వేల కోట్ల దూరంలో ఉన్న ఈ గ్రహాలన్నీ ఒకే వరుసపై వచ్చినప్పుడు కనిపించే దృశ్యం మాటల్లో వర్ణించలేమని నిపుణులు చెబుతున్నారు.

మెర్క్యూరీ, వీనస్, జూపిటర్, మార్స్‌ గ్రహాలను బైనాక్యులర్స్, టెలిస్కోప్ వంటి వాటి సాయం లేకుండా నేరుగానే చూడొచ్చు. ఆకాశంలో అత్యంత కాంతిమంతంగా కనిపించేవి వీనస్, జూపిటర్ గ్రహాలు. వీటిని సులువుగానే గుర్తించొచ్చు. ఎర్రని వర్ణంలో కనిపించే అంగారకుడిని కూడా సులభంగానే గుర్తించొచ్చు. అయితే, శని గ్రహాన్ని వీక్షించడం మాత్రం కొంత కష్టం. భూమ్యాకాశాలు కలిసినట్టు కనిపించే హొరైజ్‌కు అతి సమీపంలో శని గ్రహం కనిపిస్తుంది. సాయంత్రం సమయంలో సూర్యుడి వెలుగులో అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఇక యూరేనస్, నెప్ట్యూన్‌ను చూడాలంటే కచ్చితంగా టెలిస్కోప్ కావాలి.


Top Viral Moments of Kumbhmela: మమాకుంభమేళా.. జనాల్ని ఆశ్చర్య పరిచిన టాప్ 10 ఉదంతాలు ఇవే

ఇక నిపుణులు చెప్పేదాని ప్రకారం, ఏడు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే ఈ అద్భుత క్షణాలను చూసేందుకు నేటి సాయంత్రం అత్యంత అనుకూలమైన సమయం. ముఖ్యంగా మెర్క్యూరీ, శాటర్న్ గ్రహాలను చూసేందుకు కొన్ని నిమిషాల పాటు మాత్రమే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గురు, శుక్రవారాల్లో వాతావరణం సాధారణంగా ఉంటుందని కాబట్టి ఇదే మంచి సమయమని చెబుతున్నారు. ఈ అంతరిక్ష అద్భుతాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా వీక్షించాలంటే ఎత్తైన ప్రదేశం లేదా విశాల మైదాన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. హొరైజన్ స్పష్టంగా కనబడే ప్రాంతానికి వెళ్లాలి. నగరాల్లోని కృత్రిమ వెలుతురుల వల్ల ఆటంకం కలిగే అవకాశం ఉంది కాబట్టి నగరాలకు వీలైనంత దూరంగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అంతేకాకుండా, అంతరిక్ష వీక్షణం ప్రారంభించే ముందు 30 నిమిషాల పాటు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూడకుండా ఉంటే ఈ అద్భుతాన్ని మరింతగా ఆస్వాదించొచ్చని చెబుతున్నారు.

Read Latest and Viral News

Updated Date - Feb 28 , 2025 | 09:00 AM