ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Modi: ట్రంప్ టారిఫ్‌ల బాణం.. వచ్చే నెల అమెరికాకు మోదీ!

ABN, Publish Date - Aug 13 , 2025 | 10:35 AM

Modi: భారత దేశంపై అమెరికా టారిఫ్‌ల భారం వేస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మోదీ అమెరికాకు వెళ్లేందుకు సిద్దమైనట్లు సమాచారం.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: భారత దేశంపై అమెరికా టారిఫ్‌ల భారం వేస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మోదీ అమెరికాకు వెళ్లేందుకు సిద్దమైనట్లు సమాచారం. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో సమావేశం కానున్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మోదీ పర్యటన నేపథ్యంలో అమెరికా- భారత్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్‌కు బ్రేక్ పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ఈ వార్త అప్డేట్ చేయబడుతోంది...

రష్యాతో దోస్తీ.. ట్రంప్‌కు కోపం!

రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలు ట్రంప్‌కు నచ్చనట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే భారత్ పై అమెరికా టారిఫ్ లను విధించింది. ఒకసారి కాదు రెండు సార్లు పెంచారు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్. తొలుత 25 శాతం టారిఫ్ విధించిన ఆయన.. ఇటీవల రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు గాను 25 శాతం మేర భారత్‌పై మొత్తం 50 శాతం టారిఫ్‌లను విధించారు. అయితే.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా రష్యా ఆర్థికంగా బలపడి ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తోందని.. ఈ కారణంతోనే భారత్ పై అమెరికా సుంకాలు విధించిందని ఆయన మీడియా ప్రకటన చేశారు. కాగా త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనతో ఈ సుంకాల భారం తగ్గుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.

Updated Date - Aug 13 , 2025 | 11:03 AM