Solar Eclipse: సూర్యగ్రహణం గురించి మీకీ విషయాలు తెలుసా
ABN, Publish Date - Sep 19 , 2025 | 11:24 PM
సూర్యగ్రహణం గురించి చాలా మందికి తెలియని పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
సూర్యగ్రహణం గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
చండ్రుడి కక్ష్య భూమితో పోలిస్తే 5 డిగ్రీల వంపు తిరిగి ఉంటుంది కాబట్టి ప్రతి నెలా సూర్య గ్రహణం రాదు
సంపూర్ణ సూర్య గ్రహణం సమయంలో మాత్రమే సూర్యుడి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. శాస్త్రపరమైన అధ్యయనాలకు ఇది అత్యంత అనుకూలం
సూర్యుడికి చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇవి నాలుగు రకాలు
సూర్య గ్రహణం గరిష్ఠంగా 7 నిమిషాల 30 సెకెన్ల పాటే ఉంటుంది. మిగతా సూర్యగ్రహణాలన్నీ ఇంతకంటే తక్కువ సమయమే ఉంటాయి.
సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో ఆకాశం చాలా వరకూ కాంతివిహీనంగా మారుతుంది. కొన్ని జంతులు ఈ సమయాన్ని రాత్రిగా భావిస్తాయి.
సూర్య గ్రహణాన్ని భూమ్మీద కొన్ని ప్రాంతాల నుంచే చూడలం. అందుకే జనాలు సూర్య గ్రహణాన్ని వీక్షించేందుకు వేల మైళ్లు ప్రయాణిస్తారు.
Updated Date - Sep 19 , 2025 | 11:24 PM