Health Risks-Workforce: భారత్‌లో యువ ఉద్యోగుల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యలు ఇవే
ABN, Publish Date - Sep 26 , 2025 | 10:44 PM
ఇండియా వర్క్ ప్లేస్ వెల్ బీయింగ్ రిపోర్టు-2025 ప్రకారం, దేశంలో యువ ఉద్యోగులను వేధిస్తున్న సమస్యలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రతి 10 మంది ఉద్యోగుల్లో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇవి వారి పనితీరుపై కూడా ప్రభావం చూపుతోంది.
40 ఏళ్లకు ముందే గుండె సమస్యలు మొదలవడంతో అనేక మంది యువ ఉద్యోగులు సతమతం అవుతున్నారు.
25–35 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో 14% మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.
20-30 ఏళ్ల వారిని కూడా థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్ వంటి వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి.
తలనొప్పులు, ఇన్ఫెక్షన్లు వంటి సాధారణ అనారోగ్యాలు బారిన పడటం రోజువారి ఉత్పాదకతను తగ్గిస్తోంది.
20ల్లో ఉన్న 70% మంది ఉద్యోగులు పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.
అనారోగ్యం చుట్టుముట్ట కుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సంరక్షణ చర్యలపై చాలా మంది ఉద్యోగుల్లో అవగాహన ఉండటం లేదు
ఉద్యోగుల ఆరోగ్యాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా సంస్థలు వారి నిద్ర వేళలు, ఒత్తిడి, ఆరగ్య సమస్యలను ముందుగా గుర్తించడం వంటివి చేయాలి
Updated Date - Sep 26 , 2025 | 10:44 PM