ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ganesh Immersion: గణేశ్ నిమజ్జనం వేళ.. లైటింగుల వెలుగులో ట్యాంక్ బండ్

ABN, Publish Date - Sep 05 , 2025 | 09:32 PM

గణేశ్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ట్యాంక్ బండ, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్‌ల వద్ద నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నిమజ్జనం కోసం ఆ పరిసర ప్రాంతాల్లో 40 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఈ నిమజ్జనం ప్రక్రియ సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం పోలీసులతోపాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులను సైతం రంగంలోకి దింపింది.

1/8

గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రారంభమైంది. అందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ట్యాంక్‌ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేశారు.

2/8

విగ్రహాలు ఎత్తు ఎక్కువగా ఉంటే పోలీసుల అనుమతితో నిమజ్జనానికి తీసుకెళ్లాల్సి ఉంటుందని భక్తులకు ప్రభుత్వం సూచించింది.

3/8

ఈ నిమజ్జనం కోసం గణేశ్ విగ్రహాలు తీసుకు వెళ్లేందుకు నగరంలో మ్యాప్ ద్వారా రూట్స్ డిసైడ్ చేశారు.

4/8

మండపాల నిర్వాహకులు ఈ సూచనలు పాటించాల్సి ఉంది. ఇక రహదారులపై డైవర్షన్ ఉన్న చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటికి అనుగుణంగా వినాయకులను తీసుకెళ్లాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది.

5/8

ఈ నిమజ్జనం వేళ.. 29 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. రేపు అంటే.. శనివారం మధ్యాహ్నం 1 గంట లోపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది.

6/8

శనివారం ఒక్క రోజే.. సుమారు 50 వేల విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

7/8

మరోవైపు.. గణేశ్‌ నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తెలిపారు.

8/8

నగర వ్యాప్తంగా నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను అధికారులు ఏర్పాటు చేశారన్నారు. ఖైరతాబాద్ నిమజ్జనం చూడటానికి 40 లక్షల మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొంటారని వివరించారు.

Updated Date - Sep 05 , 2025 | 09:41 PM