కాలగర్భంలోకి మరో ప్రముఖ థియేటర్
ABN, Publish Date - Feb 24 , 2025 | 08:39 PM
సికింద్రాబాద్ పాట్నీ వద్ద ఉన్న ఐకానిక్ నటరాజ్ సినిమా థియేటర్‌ను భారీ యంత్రాలతో ఇవాళ (ఫిబ్రవరి-24)న నేలమట్టం చేశారు. కూల్చివేత సమయంలో చుట్టుపక్కల వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే సమాచారం అందజేశారు.
సికింద్రాబాద్‌లోని పాట్నీలో ఉన్న ఐకానిక్ నటరాజ్ సినిమా థియేటర్ కాలగర్భంలో కలిసిపోయింది.
ఎన్నో ఏళ్లుగా చాలా చిత్రాలను ప్రదర్శించి ప్రేక్షకులకు నటరాజ్ సినిమా థియేటర్ వినోదాన్ని అందించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి 70MM థియేటర్ కావడం గమనార్హం. ఎంతో సువిశాలమైన ప్రాంతంలో ఈ థియేటర్ ఉండేది.
ఐకానిక్ సింగిల్ స్క్రీన్ థియేటర్ నటరాజ్‌లో చాలా ఏళ్లుగా ప్రదర్శనలను నిలిపివేశారు.
ఇందులో చిట్టచివరిగా ఇంధ్ర సినిమాను 2002లో ప్రదర్శించారు. ఆ తర్వాత నుంచి ప్రదర్శనలను నిలిపివేశారు.
సికింద్రాబాద్, పాట్నీలో ఉండే సినీ అభిమానులకు మూవీ థియేటర్ ఎంతో అనువుగా ఉండేది.
ఈ థియేటర్‌ను కూల్చివేసి బహుళ అంతస్తుల్లో నివాస భవన సముదాయంతో పాటు షాపులను నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భవనం కూల్చివేత సమయంలో బిల్డింగ్ ఓనర్స్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
పాత భవనం కావడంతో కూల్చివేసినట్లు తెలుస్తోంది. కూల్చివేత సమయంలో చుట్టుపక్కల వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే సమాచారం అందజేశారు.
ఈ థియేటర్‌ను కొంతకాలంగా ఫర్నిచర్ షాపుల గోడౌన్‌గా వినియోగిస్తున్నారు.
Updated Date - Feb 24 , 2025 | 09:08 PM