Bandi Sanjay: కరీంనగర్‌లో బండి సంజయ్ పర్యటన
ABN, Publish Date - Jan 10 , 2025 | 02:10 PM
కరీంనగర్‌లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులను బండి సంజయ్ పరిశీలించారు. తీగలగుట్టపల్లి దగ్గర నిర్మిస్తున్న ఆర్వోబీ పనులు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్వోబీ పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల గురించి బండి సంజయ్ ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యంగా లేకుండా త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
వాహనాలకు ప్రత్యామ్నాయ రోడ్డు లేకపోవడంతోనే ఆర్వోబీ పనుల్లో జాప్యం జరుగుతోందని బండి సంజయ్ అన్నారు.
అనంతరం మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంతో సీఎం రేవంత్‌కు ఏదో ఒప్పందం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తారో.. లేదో తెలియదని అన్నారు. కేటీఆర్ అవినీతిని సమర్థిస్తే మీరూ అవినీతిపరులేనని బండి సంజయ్ ఆరోపించారు.
Updated Date - Jan 10 , 2025 | 02:12 PM