ABN Andhra Jyothy: అంబరాన్నంటిన 'ఆంధ్రజ్యోతి-ఏబీఎన్' ముగ్గుల సంబరం
ABN, Publish Date - Jan 04 , 2025 | 05:07 PM
ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పండుగ వచ్చేసింది.. మహిళలకు ఆనందం తెచ్చేసింది..ప్రతి ఏటా సంక్రాంతికి ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహిం చడాన్ని ఆంధ్రజ్యోతి ఓ సంప్రదాయంగా కొనసాగిస్తోంది.
ఈ ఏడాది కూడా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలకు ముస్తాబవుతోంది.
పోటీల్లో పాల్గొనే మహిళలు ఒక గంట ముందే ప్రాంగణానికి చేరు కోవాలి.విజేతలకు అదే రోజు బహుమతులు అందజేస్తారు.
మొదటి బహుమతి రూ.6 వేలు, రెండో బహుమతి రూ.4 వేలు,మూడో బహుమతి రూ.3 వేల నగదు అందజేస్తారు. మరో పది మందికి కన్సోలేషన్ బహుమతులు ఇస్తారు.
పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వనున్నారు.
పోటీల్లో మహిళలు మాత్రమే పాల్గొనాలి. ముగ్గు, రంగులు, పువ్వులు, వగైరా సామగ్రి ఎవరికి వారే తెచ్చుకోవాలి.
చుక్కల ముగ్గులు మాత్రమే పెట్టాలి. జడ్జిలు అడినప్పుడు ఎన్ని చుక్కలు, ఎన్ని వరసలు అని చెప్పగలగాలి.
. ముగ్గువేయడానికి గరిష్ట సమయం 2గంటలు ఉంటుంది.
ముగ్గు చేతితోనే వేయాలి. గొట్టాలు, బద్దలు వంటివి ఉపయోగించకూడదు.
జల్లెడ ఉపయోగించేందుకు అనుమతి ఉంది. ముగ్గుల్లో గొబ్బెమ్మలను, బతుకమ్మలను అమర్చుకోవచ్చు.
ఇతరత్రా వస్తువులను అదనపు ఆకర్షణ కోసం వాడకూడదు.
Updated Date - Jan 04 , 2025 | 05:07 PM