Mallojula Venugopal: మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత మల్లోజుల బృందం
ABN, Publish Date - Oct 15 , 2025 | 08:27 PM
ఆయుధాలను వీడి 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట మల్లోజుల అధికారికంగా లొంగుబాటు
జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ బృందం
సీఎం సమక్షంలో తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించిన మావోయిస్టులు
మల్లోజుల, ఆయన బృందాన్ని జన జీవన స్రవంతిలోకి ఆహ్వానించిన సీఎం ఫడ్నవీస్
మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు
మల్లోజులపై వందకు పైగా కేసులు.. మల్లోజుల సొంత రాష్ట్రం తెలంగాణ
పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్‌రావు మూడో సంతానం
తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి
చదువు పూర్తయిన అనంతరం తన అన్న పిలుపు మేరకు ఉద్యమంలోకి ప్రవేశం
మల్లోజులను అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు
మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డు ఉన్నట్లు ప్రకటించిన గడ్చిరోలి పోలీసులు
Updated Date - Oct 15 , 2025 | 08:29 PM